తోడేలు:- - యామిజాల జగదీశ్
 తోడేలు ఎప్పుడూ జంతువుల శవాలను కానీ మనుషుల శవాలను కానీ తినదు. అది తన జీవితాంతం ఒకే భాగస్వామితో గడుపుతుంది. దాని తల్లి లేదా సోదరితో జతకట్టదు. మరో మాటలో చెప్పాలంటే ఇది ఏకపత్నీవ్రత జంతువు. అది మోసం చేయదు. తన భాగస్వామి చనిపోతే, ఆ తోడేలు ఒంటరిగానే ఉంటుంది. దానికి తన పిల్లలు బాగా తెలుసు. వృద్ధాప్య తల్లిదండ్రులకు సహాయం చేసి వారికి ఆహారం తెచ్చే ఏకైక జంతువు అది.
అటువంటి తోడేలును వేటాడి చంపినప్పుడు, దాని ఆత్మ దానిని విడిచిపెట్టే వరకు అది మీ కళ్ళలోకి చూస్తుందట. అది కుక్క కంటే 25 శాతం తెలివైనది. 
తోడేళ్ళు ఆలోచిస్తాయి. కలలు కంటాయి, ప్రణాళికలు వేస్తాయి. ఒకదానితో ఒకటి తెలివిగా సంభాషిస్తాయి.
అటువంటి దానిని
శిక్షణను పాటించని ఏకైక జంతువది అని అంటుంటారు. కానీ పై విషయాలతో మనం మాట మార్చుకోవాల్సి వస్తుందేమో కదూ.

కామెంట్‌లు