సాహితీ కవికళా పీఠంసాహితీ కెరటాలు====================ఏమీ తోచని వేళ,ఏమీ కాదన్న వేళ,ఒంటరై కోరే వేళ -సుదూర తీరపు ప్రయాణం!ఏదో ఎటువైపుకో,తేల్చని ఈ ప్రయాణం.గమనాలను తడుముతూ,బంధాల బాంధవ్యాలను మరచి.ఎందాకో, ఎక్కడికో,తలవని పయనంసుదూర తీరాల వైపు మళ్లింది,జ్ఞాపకాల జంజాటంలో.పడి లేచే కెరటమై,సాగర దుఃఖం వెంటేసుకొని,ఏమీ తెలియని బ్రతుకులో,తానే నిలబడి నిస్సహాయతతో.ఏమిటో అర్థంకాని అయోమయంగా -సత్యాలు, అసత్యాలు,న్యాయాలు, అన్యాయాలు -తెలుసుకోలేక మొదలెట్టిన జీవిత ప్రయాణం.ఇదేనో ఇంకేదో చూపాలని,తనలో తాను మదన పడుతూనే,వేదాల సారం కాస్తూనే,కొవ్వొత్తి దీపంలో ఆవిరవుతూ,సుదూర తీరాలకు చేరింది.ఓ ప్రాణ దీపం.ఆత్మవిశ్వాసం కోల్పోయి,నిత్య జీవితంలో భాగమై.
అయోమయ గమనం :- డా. కె. మంజుప్రీతమ్ -మదనపల్లె
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి