పడితే పడుండకూడదు:- - యామిజాల జగదీశ్
 “నేను వీధుల్లో పోరాడటానికి పాఠశాలను విడిచిపెట్టాను. చివరికి ఒలింపిక్ స్వర్ణం కోసం పోరాడాను.”
ఈ మాటలు ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్మాన్ వి.
ఫోర్మాన్ ప్రయాణాన్ని ఆయన మాటల్లోనే....
నేను ఛాంపియన్‌గా జన్మించలేదు. కష్టం, సిగ్గు, దృఢ సంకల్పం ద్వారా నేను ఎదిగారు. హూస్టన్‌లోని అత్యంత కఠినమైన పరిసరాల్లో  పెరిగాను. పేదరికం నేనెంచుకున్నది  కాదు. అది మేము పీల్చుకునే గాలైంది. ఏడుగురు తోబుట్టువులలో ఒకడినైన నేను తరచుగా ఆకలితో పడుకునే వాడిని.
చిన్నప్పుడు, నేను దూకుడుగా ఉండేవాడిని. 
గొడవల్లో తలదూర్చే వాడిని. బతకటం కోసం అప్పుడప్పుడూ దొంగతనాలూ  చేసేవాడిని. 
15 సంవత్సరాల వయస్సులో, నేను పాఠశాల నుండి తప్పుకున్నాను.
అప్పుడు నేను జైలులో పడతానని లేదా అంతకంటే దారుణ స్థితులెదురుకొంటానని, చేదు అనుభవాలు ఎదురవుతాయని అందరూ అన్నారు.
తర్వాత ఒక రాత్రి, నేను టీవీలో బాక్సింగ్ పోటీ చూశాను. నాలో ఏదో తట్టింది. నేను యూత్ పీస్ కార్ప్స్‌లో చేరాను. మొదటిసారిగా జత గ్లౌసులు  ధరించాను. 
1968లో గల్లీల్లో గొడవపడుతూ తిరుగుబాటుదారుడైన నేను పోడియంపై నిల్చుని ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని పొందుతానని, జాతీయ గీతం పాడటం వింటానని నేను ఎప్పుడూ ఊహించలేదు.
హెవీవెయిట్ ప్రపంచ ఛాంపియన్‌గా మారాలా? నమ్మశక్యం కానిది...కానీ అన్నింటినీ కోల్పోవడం నా మలుపు.  అదృష్టం, గౌరవం జారిపోవడం నేను చూశాను. నేను లాకర్ గదిలో దాదాపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తరుణం నా లక్ష్యాన్ని తిరిగి మార్చింది.
45 ఏళ్ళ వయసులో, నా జీవితం అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఆకారంలో మార్పొచ్చింది. కానీ నేను తెలివిగా శిక్షణ పొందాను. నేను మొదటిసారి గెలిచిన రెండు దశాబ్దాల తర్వాత అద్భుతమైన పునరాగమనంలో ప్రపంచ టైటిల్‌ను తిరిగి పొందాను. అది పెద్ద వయస్సులో టైటిల్ గెల్చి చరిత్రలో హెవీవెయిట్ ఛాంపియన్ గా  అందరి మన్ననలు పొందారు.
నేను చివరికి నా గ్లౌసులు వేలాడదీసినప్పుడు, నేను వేగాన్ని తగ్గించలేదు. నేను నా పేరును బ్రాండ్‌గా మార్చుకున్నాను. జార్జ్ ఫోర్‌మాన్ గ్రిల్స్,  ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల గ్రిల్‌లను విక్రయించాను. ఎందుకంటే మీరు పదిసార్లు పడిపోవచ్చు. అలా పడినప్పుడు లేవాలి. నిల్చోవాలి. అలా కాదని పడిన చోటు నుంచి లేవకుంటే మాత్రమే విఫలమవుతాం.
చాలా ఆలస్యం అయిందని, మీరిక పోటీ చేయలేరని, మీ క్షణం గడిచిపోయిందని వారు మీకు ఎన్నిసార్లు చెప్పినా పర్వాలేదు. మీ హృదయం ఇంకా కొట్టుకుంటుంటే, మీ కథ ముగియ లేదనుకోవాలి. కొన్ని. సార్లు నిజమైన ఛాంపియన్ ప్రతిదీ కోల్పోయిన తర్వాత పుట్టుకొస్తాడనే దానికి నేనూ ఒక ఉదాహరణే. 
జార్జ్ ఎడ్వర్డ్ ఫోర్‌మాన్ 1949 జనవరి 10న జన్మించారు. 2025 మార్చి 21న మరణించారు. అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సరుగా, వ్యాపారవేత్తగా, రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. 
ఆయన బాక్సింగ్ కెరీర్ దాదాపు ముప్పై ఏళ్ళు సాగింది.  ఆయనను " బిగ్ జార్జ్ " అని పిలిచేవారు.  ఆయన రెండుసార్లు ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యారు. ఒలింపిక్ బంగారు పతక విజేత కూడా. 

కామెంట్‌లు