జంక్ ఫుడ్ను నిషేధించాలి.!?:-డా ప్రతాప్ కౌటిళ్యా.జంక్ ఫుడ్ను నిషేధించాలి.!?:-డా ప్రతాప్ కౌటిళ్యా.
 జంక్ ఫుడ్ తినడం వలన చిన్నారులకు ఎక్కడా లేని చురుకుదనం వస్తుంది. ఎందుకంటే  ఇన్స్టంట్ ఎనర్జీ అందడం వలన. తీపి తింటే ఎలాగైతే ఎనర్జీ బ్రెయిన్ కు వెంబడే అందుతుందో సరిగ్గా అలాగే జంక్ ఫుడ్ తినడం వలన ఎనర్జీ ఎక్కువై పిల్లలు ఉత్తేజితులు ఉల్లాసవంతులై చివరికి వెకిలి చేష్టలకు అల్లరి అరుపులకు అలవాటు పడతారు. 
ఎలాగైతే మనం తీపి కి బానిసలమవుతామో ఆడిక్టు అవుతామో సరిగ్గా అలాగే చిన్నారులు జంక్ ఫుడ్ కు బానిసలైపోతారు. అవి తిన్న కొంతసేపు మాత్రమే శక్తివంతంగా ఉంటారు. ఆ తర్వాత శక్తిహీనులైపోతారు. అందుకే మళ్ళీ మళ్ళీ ఆహారాన్ని కోరుకుంటారు. దీనివల్ల వాళ్లు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని శక్తినిచ్చే వాటికోసం వెతుకుతారు. 
అంటే మత్తు పదార్థాలను ఎక్కువగా కోరుకుంటారు. వాళ్లు ఎక్కువ శక్తిని ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు మత్తు పదార్థాలు కావాలంటారు. దానికి వాళ్ల బాల్యంలో పడ్డ జంక్ ఫుడ్ ప్రభావమే కారణం కావచ్చు. జంక్ ఫుడ్ తీపి మత్తు పదార్థాలు ఎలాంటివంటే ఒకరకంగా డ్రగ్స్ కు అలవాటు పడటం లాంటివే వీటిని చిన్నారులకు అందకుండా నిషేధించాలి. కేవలం పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే సిఫారసు చేయాలి. 
డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు