భక్తిసాధనం-గిరిజాపతీ:-జి.లింగేశ్వర శర్మ - సిద్ధిపేట
 మ.కో
ఫాలలోచన! భస్మరాజిత!
పాపమోచన!శంకరా!
శూలధారిగ! చంద్రశేఖర!
సుప్రసాదుడ! ధూర్జటీ!
నీలకంధర! నాగభూషణ!
నిన్ను వేడెద భక్తితో!!
జాలిజూపరనీదుభక్తుడ స్వామిహేగిరిజాపతీ
మ.కో.
నాగభూషణనందివాహన
నర్తనాప్రియ రుద్రుడా!
సాగిపోవగజీవితమ్మిల*
సంతసమ్ముగముందుకున్!
జాగుసేయకనీలకంధర*
జాలిజూపుచుభక్తులన్!
భోగభాగ్యములందజేసియుబ్రోవుమోగిరిజాపతీ
మ.కో
వేదమంత్రసుఘోషతోడుత*
వేడుచుండగనిత్యమున్!
ఆదిశక్తియెతోడునుండగ*
నాదుకొమ్మిలభక్తులన్!
ఆదిభిక్షువులోకమందున*
నాది దేవుడ వీవుమా!
బాధలన్నియుబాపిమాకిడు
భాగ్యమోగిరిజాపతీ
మ.కో
నిర్వికారిగ,నీలకంఠుడ
నిండియుంటివినంతటన్!
సర్వమంగళరూపమందున
శాంతిసౌఖ్యములీయగన్!
సర్వమీవని,భారముంచితి
సన్నుతించుముభక్తితో
గర్వమంతయుద్రుంచివేయుచు 
గావుమోగిరిజాపతీ
మ.కో
వెండికొండయెనీదువాసము పింగళాక్షుడశంకరా
చండికేశుడునిన్నుగొల్చియుసన్నుతించెనుమిన్నగా
దండిగామహిమల్నిజూపుచు త్ర్యంబకేశ్వరభక్తులా
అండనుండుచునెల్లవేళలనాదుకోగిరిజాపతీ
మ.కో
పంచవక్తృడు వ్యోమకేశుడుఫాలచంద్రుడశంకరా
పంచబిల్వములేరిదెచ్చిభక్తిలర్పణజేయగా
సంచితమ్మగుపాపకర్మలసన్నుతించగదూరమై
మంచిరోజులనందజేతువుమాకుహేగిరిజాపతీ

మ.కో
ఈశ్వరాపరమేశ్వరాశుభమిందుశేఖరశంకరా
ఈశ్వరార్చనజేయువారలయీప్సితమ్ములదీర్చుచూ
శాశ్వతమ్ముగనందజేయుచుసర్వసంపదలన్నిస
ర్వేశ్వరాయిలలోనభక్తుల ప్రీతిగాగిరిజాపతీ
మ.కో
ఇందుశేఖరకృత్తివాసమహేశహేగిరిజాపతీ
నందివాహననీలకంధరనాగహారుడశంకరా
వందనమ్మిడివేడుకొందుమువాంఛలన్నియుదీర్చరా
వందితాఖిలదేవదేవుడభవ్యుడాగిరిజాపతీ
ధ్రు.కో
హరహరాయనిలోకమందునహాటకేశ్వరభక్తితో
నరులునిత్యముజేయుచుండిననామకీర్తనమెంతయో
పరిహరించుచుపాపమంతయుభక్తిభావమునిండగా
పురహరా!లభియించునంతయు
పుణ్యమే గిరిజాపతీ..!!
ధ్రు.కో
ధరణిలోననుపూజలొందుచుధర్మవాహనశంకరా
వరములీయగమానవాళికివాంఛలన్నియుదీర్చుచున్
చిరయశమ్ములనందజేసియుచిద్విలాసముగూర్చుమా
స్థిరముగాశివలింగరూపుడచిన్మయాగిరిజాపతీ
జి.లింగేశ్వర శర్మ 
సిద్దిపేట

కామెంట్‌లు