'అంకెలు':- ---డా.పోతగాని సత్యనారాయణ

(ఒత్తులు లేని బాల గేయం -4)

ఒంటరిదైతే ఒకటి 
జంటగ ఉంటే రెండు
జంటతో ఒంటరి మూడు
మంచెకు గుంజలు నాలుగు

పంజా అనగా ఐదు 
రుచులకు అంకె ఆరు

హరివిలు రంగులు ఏడు
భోగాలుంటవి ఎనిమిది
రసములు తెలిపిరి తొమ్మిది 
దిశలవి చూచిన పది


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
నవమి అనవచ్చు.ఒత్తులేని పదంగా.9గా పరిచయం చేయడంవలన ఒత్తులులేనిగేయంలో మినహాయింపు ఐనది.గేయంబాగుంది పోతగానివారూ అభినందనలు