సుప్రభాత కవిత : -బృంద
గుండెలనిండా గాలిపీల్చి 
కన్నులు రెండూ మూసివుంచి 
వెచ్చని స్పర్శను అనుభవిస్తూ 
రాకను చూసే భాగ్యమిచ్చిన 
మిత్రునికి హృదయంతో ఆహ్వానం!

అరుణకాంతులతో రంగవల్లులు
అందంగా అలంకరించి 
ఆతృతగా ఆగమనానికై  
తూరుపు వైపు చూస్తున్న ఆకాశం!

పరవశంగా నర్తిస్తూ..
పసిడి వెలుగులకై  నిరీక్షిస్తూ
పలకరించే ఆత్మీయ నేస్తం 
పిలుపుకై  పలవరిస్తున్న అవని!

గగనవీధిని  ఊరేగే వెలుగురథం
కిరణపు తాళ్లను లాగే ఉర్వీపథం
కాంతుల ధారల తడుస్తూ
రహదారిని నిలిచి చూచు జనపదం

కొండల మాటున వెలిగే 
గుండెల దాగిన చెలిమి 
నిండుగ పంచగ ఏతెంచు 
పగడపు కాంతుల ప్రభువుకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు