భావి భారత పౌరులు:- విత్తనాల విజయకుమార్ -హైదరాబాద్
సాహితీకవికళా పీఠం
 సాహితీ కెరటాలు 
============
అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలు.
వెచ్చటి స్పర్శను గుర్తించే చిన్నారులు.
చేరదీసిన వారికి చేరువవుతారు. 
ఆడిస్తే బోసి నవ్వుల కానుకలిస్తారు.

ఆట బొమ్మలతో ఆటలాడీ,
పలికిన పలుకులే ముద్దుగా పలికీ,
మాయా మర్మం తెలియకుండా,
దినదినాభి వృద్ధి పొందే చిన్నారి బుడతలు.

ఏడిస్తే ఊరడించడానికి లంచాలనిచ్చి,
బూచోడెత్తుకుపోతాడని  భయాన్ని నేర్పి,
అడిగే సందేహాలకు అబద్ధాలు చెప్పి,
బుడతలను పాడు చేసేదే పెద్దలు.

బుడతలు చేసే అల్లరి నచ్చితే చప్పట్లూ,
చికాకు కలిగితే వీపున చరుపులూ,
వారి అల్లరి పనులకు వంశ పోలికలు పెట్టీ,
అన్ని అలవాటులూ అలవరిచేదే పెద్దలు.

మంచి చెడులను విడమరిచి చెప్పీ,
ధైర్య సాహసాలను నూరిపోసి, 
నీతి నిజాయితీల విలువలను చెబితే, 
మన బుడతలు పండితులవుతారు.
భావి భారత పౌరులవుతారు.

•••••••••••••••


కామెంట్‌లు