వేకువ చుక్క కావాలి:- --గద్వాల సోమన్న, 9966414580.
పొడవాలి చుక్కలా
ఎదగాలి మొక్కలా
అనుదిన జీవితాన
అద్భుత సమాజాన

విరియాలి పూవులా
కురియాలి చినుకులా
ఉండాలి అండగా
నలుగురికి కొండలా

మ్రోగాలి మువ్వలా
ఎగరాలి గువ్వలా
స్వేచ్ఛగా సాగుతూ
నవ్వులే రువ్వుతూ

అందరికి స్ఫూర్తిగా
బ్రతుకులో  గొప్పగా
వేకువ చుక్క  రీతి
తేవాలి ఘన ఖ్యాతి


కామెంట్‌లు