నేను!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
బిడ్డ కోసం 
తనను తాను వదులుకోవడానికి 
నేను అమ్మ నేం కాను!!?

మేఘాన్ని 
వదులుకోవడానికి 
నేనేం ఆకాశాన్ని కాను!!?

విత్తును 
వదులుకోవడానికి 
నేనేం వృక్షాన్ని కాను!!?

వదులుకోవడానికి 
నా దగ్గర ఏం లేదు 
శ్వాస తప్ప.!?

శ్వాసే దృశ్యం 
శ్వాసే శబ్దం 
శ్వాసే శరీరం!!!?

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు