జర జాగ్రత్త మానవా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పుండుమీద
కారం చల్లేవారున్నారు
పాలలో
విషం కలిపేవారున్నారు

కళ్ళను 
పొడిచేవారున్నారు
నోర్లను
మూసేవారున్నారు

నిప్పురవ్వలు
చల్లేవారున్నారు
గుంటల్లోకి
పడదోచేవారున్నారు

బాధలు
పెట్టేవారున్నారు
బూతులు
తిట్టేవారున్నారు

ఎక్కేవారిని
క్రిందకు లాగేవారున్నారు
నడిచేవారిని
ఆటంకపరచేవారున్నారు

కష్టాలు
కలిగించేవారున్నారు
నష్టాలు
మోపేవారున్నారు

ద్వేషాలు
రగిల్చేవారున్నారు
మోసాలు
చేసేవారున్నారు

బురద
చల్లేవారున్నారు
నిందలు
వేసేవారున్నారు

చేతులకు
బేడీలు తొడిగేవారున్నారు
కాళ్ళకు
సంకెళ్ళు వేసేవారున్నారు

హత్యలకు
పాల్పడేవారున్నారు
శీలాలు
దోచుకునేవారున్నారు
 
నరరూపరాక్షసులను
గమనించు
అసూయపరులను
దూరంగాపెట్టు

మంచివారితో
చేతులుకలుపు
ముంచేవారితో
తెగతెంపులుచేసుకొమ్ము


కామెంట్‌లు