ఒక ఆశ్రమం. అక్కడ ఒక గురువు ఉన్నాడు. ఒక వ్యక్తి ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాడు. గురువు ఆయన వైపు చూశాడు.
"మీకేం కావాలి?" అని గురువు అడిగాడు.
"స్వామీ, నేను దేవుడిని చూడాలనుకుంటున్నాను!" అని చెప్పాడు తాను.
"అటువంటప్పుడు మీరు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు" అన్నది గురువు ప్రశ్న.
అప్పుడతను "దేవుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను. దేవుడిని ఎలా చూడాలి... దేవుడితో ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి? ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది" అన్నాడు.
"సరే, బయలుదేరు!" అన్నాడు గురువు.
"ఎక్కడికి?" అని అతనడిగాడు.
"ఇక్కడ ఉన్న కొంతమంది శిష్యులను చూసొద్దాం. రండి" అని చెప్పి గురువుగారు అతనిని తీసుకుపోయారు.
అతను గురువుగారిని అనుసరించాడు.
కొంత దూరంలో ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఇద్దరు శిష్యులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
గురువు వారిని చూపిస్తూ, "చూడండి, వారు ఏమి చేస్తున్నారు?" అని అడిగాడు.
ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారన్నాడు.
అనంతరం మరొక చెట్టు కింద, ఒక శిష్యుడు ఒంటరిగా కూర్చున్నాడు.
అతని వైపు చూపిస్తూ, "చూడండి, అతనేం చేస్తున్నాడు?" అని అడిగాడు గురువు.
అతనెందుకో ఒంటరిగా కూర్చున్నాడు అని అతనన్నాడు.
గురువు నవ్వి అతనికి వివరించాడు.
"మొదటేమో ఒక చెట్టు కింద ఇద్దరు శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. రెండవ చెట్టు కింద ఒకతను కూర్చున్నాడు.. అతనేమీ ఖాళీగా లేడు. అతను దేవునితో మాట్లాడుతున్నాడు" అని గురువన్నాడు.
ఈ మాటతో అతను మరింత అయోమయంలో పడ్డాడు.
"మీ ఉద్దేశ్యం ఏమిటి? మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు" అని అతననగా, గురువు ఇలా అన్నాడు :
"ఇక్కడ చూడు.. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడాలనుకుంటే, భాషే ఓ సాధనం. ఒక మనిషి దేవునితో సంభాషించాలనుకుంటే, "నిశ్శబ్దం" అనేదే ప్రధాన సాధనం. కాబట్టి, మీరు దేవునితో సంభాషించాలనుకుంటే, మౌనంగా ఉండండి...మీరు మనిషితో సంభాషించాలనుకుంటే, మాట్లాడండి!"
గురువు మాటతో అతను ఆలోచించడం ప్రారంభించాడు. అతను దేవునితో ఏ భాషలో మాట్లాడాలనుకుంటున్నాడో అర్థం చేసుకున్నాడు. ఆ దేవుడు తనలోనూ ఉన్నాడన్న నిజాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కథ ద్వారా ఓషో ఏమి చెబుతున్నారంటే...
"నువ్వు పుట్టినప్పుడు ఈ ప్రపంచానికి మౌనాన్ని తీసుకువచ్చావు. భాష నీకు ఇచ్చారు. సమాజంతో సంభాషించడానికి అది ఒక బహుమతి. అది ఒక సాధనం. అది ఒక పరికరం. కానీ నువ్వు ప్రపంచానికి తీసుకొచ్చిందేమో మౌనం. ఆ మౌనాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించాలి. నువ్వు మళ్ళీ పిల్లవాడిగా మారడానికి అదే మార్గం.
మహానుభావులు ఏం చెబుతున్నారో తెలుసా? నిజమైన శూన్యం...ఏకాంతమే దేవుడు. దేవునితో మాట్లాడాలనుకునే వారు నేర్చుకోవలసిన భాష మౌనం. ఇది మహానుభావులు తమ అనుభవంలో గ్రహించి మనకు చెప్పిన సత్యం. దీని గురించి ఆలోచించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి