అక్షరానికే ప్రాణం పోసిన తిలక్:- కవిమిత్ర, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)

 నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసి దయాపారావతాలని
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే ఐరావతారాలని
నా అక్షరాలు వెన్నెలలో ఆదుకునే అందమైన 
ఆడపిల్లలని చరిత్ర రక్తజలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండని
దేముడా!రక్షించు నాదేశాన్ని పవిత్రులనుండి
పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండన్న
దేవరకొండ బాలగంగాధర్ తిలక్ భావుకత
సమజానికే స్ఫూర్తి.
అక్షరంతో భావాలను  సృష్టించిన సాహితీ ద్రష్ట
కవిగా, కథకునిగా,నాటకకర్తగా
పదునైన భావాలను పలికించిన సరస్వతీ పుత్రులు
అమృతం కురిసిన రాత్రి నవలకు
ముందుమాట వ్రాసిన మహాకవి శ్రీ శ్రీ
తిలక్ మరణవార్త విన్నప్పుడు వ్రాసిన వ్యాఖ్య
'గాలి మూగబోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరక ముందే
అంతరించిన ప్రజాకవి
నభీస్సు సగం చేరక ముందే
అస్తమించిన ప్రజాకవి'
అని ఆర్ద్రతతో వ్రాసారు
నేటికి తిలక్ వ్రాసిన 'అమృతం కురిసిన రాత్రి'
ఎందరో రచయితలకు ప్రేరణ
అందుకోండి అక్షరానికే ప్రాణం పోసిన తిలక్
మీకివే నా అక్షరాంజలులు.!!
..........................

కామెంట్‌లు