ప్రోఫేసర్ జయశంకర్ సార్ : -కాల్వ రాజయ్య -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట,-సిరిసిల్లా.

తెలంగాణ సిద్ధాంతం కర్త 
ప్రోఫేసర్ జయశంకర్ సార్ 
జయంతి సందర్భంగా .... 
====================
సీ//
కొత్తపల్లియు వంశ గొప్పగుణము తోడ 
ఓరుగల్లున మీరు మార్పు కోరి 
ఆత్మకూరుకు దవ్వు అక్కము పేటందు 
తల్లిదండ్రులు మెచ్చె తనయుడయ్యి 
తెలగాణ గడ్డను తీర్చిదిద్ద నపుడు
జన్మమొందినారు జగతి మురియ
చదువు నేర్చెటి వేల చక్కగా లోచించి 
తెలగాణ నంతయు తేజరిల్ల

ఆ వె 
ఆంధ్ర పాలనందు నన్యాయ ముందని
కంటజూచి తాను కలత చెంది 
తీర్చిదిద్ది నాడు తెలగాణ వాదాన్ని 
ఉద్యమమ్ము నడిపె నుర్విమెచ్చ
ఆ వె 
నీళ్ళు, నిధులు, భూమి నియమకా లన్నియు 
వలుస వాదులన్ని వరుస గాను 
దోచుకోని వెళ్లె దొంగల నంతయు 
తరిమి కొట్టుమంటు తగువు జేసె

కామెంట్‌లు