బహుముఖ ప్రతిభాశాలి,రేడియో అక్కయ్య:గా అందరిగుండెల్లో నిల్చిన శ్రీమతి తురగా జానకీరాణిగారు31ఆగస్ట్ 1936 లో పుట్టారు.ఆమె జయంతి కి నాచిరు కానుక ఈరచన.ఆమె తల్లిదండ్రులు మందపాకల రాజ్యలక్ష్మి,వెంకటరత్నం గార్లు. తండ్రి గారిది దివిసీమ లోని మందపాకల. ఒక తమ్ముడు సుభాష్ చంద్ర. పుట్టింటివారిది మచిలీపట్నం.చొరవ ధైర్యం గుండెనిబ్బరం ఆమె సొత్తు.20ఏళ్లు హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేసి తన డాక్యుమెంటరీలకి నాల్గుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారామె. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందికి ఉదాహరణ జానకీరాణిగారు.1951లోనే14_15 ఏళ్ల వయసులో ఆమె రాసిన తొలికథ కృష్ణాపత్రిక లో పడింది.ఆకథపేరు భవిష్యత్తు ఎడిటర్ మెచ్చుకుంటూ రాసిన లేఖ ఆమెకు బోలెడంత ఉత్సాహాన్ని ఇచ్చింది.చాలా కథలు తెలుగు స్వతంత్ర, ఆంధ్ర పత్రిక వీక్లీలో రావటంతోపాటు ఆనాటి హేమాహేమీలతో పరిచయం ఏర్పడింది.గోరాశాస్త్రిగారు తెలుగుస్వతంత్ర ఎడిటర్ గా బాగా ప్రోత్సహించారు.ఆమె కథలకి బాపూ గీసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ! ఆమె అలా పుంఖానుపుంఖాలుగా రాయడం అవి అచ్చులో రావటంతోపాటు రచయిత్రిగా పిన్నవయసులోనే పేరు తెచ్చుకున్నారు.బి.ఎ.ఎం.ఎ.చదువుతూ సాహిత్యంతో స్నేహం కొనసాగించారు.రెండో సారి చదవటం దిద్దటం అనేది ఆమె కలం ఎరుగదు.జె.బి.ప్రీస్ట్లీ ఓ.హెన్రీకథల్ని కూడ అనువదించారు.ఆమె రాసిన * ఎర్రగులాబీ* అనే కథనుచాలామంది మెచ్చుకున్నారు. దండమూడి మహీధర్ గారు హిందీలో అనువదిస్తే ధర్మయుగ్ లో ప్రచురింపబడింది.రాయప్రోలు శ్రీనివాస్ గారు ఆంగ్లంలో అనువాదం చేశారు.ఇండియన్ లిటరేచర్ లో పబ్లిష్ ఐంది.ఆమె బంధువులంతా రచయితలే. చలం గారు ఆమె అమ్మమ్మ కి సోదరుడు.కొమ్మూరి, కొడవటిగంటి, ఉషారాణి భాటియా మొదలైన వారంతా బంధువులు.ఇక ఆమెరచనల్ని ప్రోత్సహించినవారు నండూరి రాంమోహన్ రావు,బాపు,ముళ్లపూడి వెంకటరమణ ఇలా ఎందరో .
ఇక ఆమె9_10ఏళ్ల వయసులో చదువుతో పాటు జాతీయ గీతాలు పాడుతూ వీధుల్లో తిరగటం గొప్ప అనుభవం.1965నుంచి ఆమె కలంనుంచి కథలు పాటలు రూపకాలు నాటకాలు లెక్కలేనన్ని వెలువడ్డాయి. అసంఖ్యాకమైన అవార్డులు, సత్కారాలు పొందారు.
గాంధీజీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చినపుడు ఓఆరేళ్లపాప జనాల్ని తోసుకుంటూ పరుగెత్తికెళ్లి తన వేలి ఉంగరం ఆయన కిచ్చి"కస్తూర్బా ఫండ్ కోసం" అనిఅనగానే బాపూజీ ఆపాప చేతిని నిమిరి ఉంగరం తీసుకున్నారు.ఆ చిన్నారి ఎవరో కాదు జానకీరాణి గారు! డాన్స్,సంగీతం,కొరియోగ్రఫీ,సోషల్ వర్కర్ ,కాలమిస్ట్ గా ఆమె జీవితం ఒక ఎత్తు.37వ ఏటనే భర్త శ్రీ తురగా కృష్ణమోహన్ రావుగారు హఠాత్తుగా మరణించటం, ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచి పెద్దజేయటం వారు తమతమ రంగాల్లో రాణించడం నిజంగా ఆమె సాధించిన ఘనవిజయం.15అక్టోబర్2014లో అక్కయ్యగారు ఈలోకాన్ని వీడినా తమతల్లిదండ్రుల ఆశయాలను అమలుపరుస్తున్న ఉషా తురగా రేవెల్లి, వసంత శోభలను మనసారా అభినందిస్తున్నాను.
ఈవ్యాసం రాయడానికి తోడ్పడిన ఆ అక్కచెల్లెళ్లకు ధన్యవాదాలు🌹
బహుముఖ ప్రతిభాశాలి,రేడియో అక్కయ్య:- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY



addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి