ప్రసార మాధ్యమాలు
సోషల్ మీడియా
చరవాణీలు
విషయాలు కాదు
విషం కక్కుతున్నారు.!
మత్తు పదార్థాలు వ్యర్ధాలు ఇక్కడ
కత్తులు కటార్లు అక్కర్లేదు ఇక్కడ
తలలు తీసేయాల్సిన అవసరం లేదు
నోటికి తాళాలు వేయాల్సిన అవసరం లేదు!!
నేరుగా విషాన్ని నెత్తికెక్కిస్తున్నారు.
అందుకే అందరూ బతికి చేస్తున్నారు.!!!?
చేతబడి చేసిన వాడిలా
అచేతనంగా మారుతున్నారు
పక్షవాతం వచ్చిన వాళ్ళలా
కాళ్లు చేతులు నోళ్లు చచ్చుబడి పోతున్నాయి.
మనసు చెడి
మానసిక రోగులుగా మారుతున్నారు.
అదో పెద్ద మాయ
అదో మహా గారడి
అది గాలి పీల్చడం వదలడం ఒక శ్వాస లాంటిది
కాదు
విశ్వాసంగా ప్రేమించడానికి
గుండెకు మెదడుకు ఊపిరితిత్తులకు
గాలి అందకుండా చేసే ఒక విషం అది.!!
సమయాన్ని మింగే ఒక పెద్ద పాము అది.
వాటికి తలలు తాకట్టు పెట్టకండి
వాటితో తలల్ని పగలగొట్టుకోకండి
మనుషులతో కలవండి
మనషులను నమ్మండి
మనుషులతో మాట్లాడండి
మనసులను ప్రేమించండి.
మంత్రాలకు చింతకాయలు రాలవు
కానీ యంత్రాలను ప్రేమించకండి...!!?
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి