ఎగురవేద్దాం..! ఎగురవేద్దాం..!
ఇంటింటా...
మువ్వన్నెల జెండా..!
మన ముచ్చటైన జెండా..!
స్మరించుకుందాం..! స్మరించుకుందాం..!
దేశభక్తిని...చైతన్యజ్వాలను రగిలించే
వందేమాతరం...జనగణమనవంటి
సుమధుర గీతాల సృష్టికర్తలైన
బంకించంద్ర చటర్జీ...
రవీంద్రనాథ్ ఠాగూర్ లను...
స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపే జాతీయపతాక రూపశిల్పి
గాంధేయవాది శ్రీ పింగళి వెంకయ్యను...
ఎగురవేద్దాం..! ఎగురవేద్దాం..!
ఇంటింటా...
మువ్వన్నెల జెండా..!
మన ముచ్చటైన జెండా..!
తెలుపుదాం..! తెలుపుదాం..! విప్లవవందనాలు..!
నినదిద్ధాం..! నినదిద్దాం..!
దిక్కులు పిక్కటిల్లేలా...
జయహో...జయహో అంటూ...
పిన్నవయసులోనే దేశరక్షణ కోసం
ప్రాణాలను తృణప్రాయంగా
త్యాగం చేసిన ఆ సాహసవీరులకు...
తల్లి భరతమాత నుదుట
రక్తతిలకాన్ని దిద్దిన ఆ వీరజవానులకు...
ఎగురవేద్దాం..! ఎగురవేద్దాం..! ఇంటింటా...
మువ్వన్నెల జెండా..!
మన ముచ్చటైన జెండా..!
గుర్తుచేసుకుందాం..! గుర్తుచేసుకుందాం..!
భారతమాత దాస్య శృంఖలాలను త్రెంచ
ఆంగ్లేయుల నెదిరించి జైళ్ళలో మ్రగ్గిన
ఆస్వాతంత్ర సమరయోధులను...
జాతినేతలను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అత్యున్నతమైన
రక్షణ కవచనం వంటి
రాజ్యాంగాన్ని రచించిన ఆ
అపరమేధావి అమరజీవి అంబేద్కర్ ను..!
(అందరికీ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి