గణపతి:- సేకరణ తాయారు
 కుమార స్వామికి సాయం
తల్లిదండ్రులే ఇతని విజయావకాశానికి దారి చూపినప్పుడు ఇతని తమ్ముడు, ఇతని సాయం కోరకుండా ఉంటాడా? ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేసి వస్తారో వారికి పండునిస్తామని తల్లిదండ్రులనడం అనే కథ మీకు తెలిసిందే. 
ఆ సందర్భంలో సుబ్రహ్మణ్యుడు గెలవలేక విరక్తిని చెందాడు. తల్లిదండ్రులు ఓదార్చారు.
సుబ్రహ్మణ్యుని అవతార ఉద్దేశ్యం శూరపద్ముణ్ణి ఓడించడమే. ఇక వల్లిని వివాహం చేసుకునే సందర్భంలో వేటగాని వేషం వేయవలసి వచ్చింది.
ఇతణ్ణి ఆమె గుర్తుపట్ట లేకపోయింది. తన నిజరూపాన్ని ప్రకటించి ప్రేమను పొందాలను కున్నాడు. ఈ సందర్భంలో అన్నగారి గొప్పదనాన్ని చాటాలనుకున్నాడు. ఏ పని చేసినా విఘ్న నాయకుణ్ణి కొలవాలనే సందేశాన్ని ఇచ్చాడు. 
ఆ సందర్భంలో మహాగణపతిని ధ్యానించాడు.
వినాయకుడు పిచ్చి యెత్తిన ఏనుగులా మారి, వల్లిని భయపెట్టాడు. వేటగాని రూపంలో ఉన్న కుమారస్వామిని భయం వల్ల వల్లి కౌగిలించుకొనవలసి వచ్చింది. అతడు కుమారస్వామియనే ఎఱుక లేకుండా జరిగింది. 
ఇక వేషాన్ని తొలగించుకొని నిజరూపంలో కుమారస్వామి ఆమె ముందు సాక్షాత్కరించాడు. వల్లిని ఆశ్చర్యంలో ముంచివేశాడు. తరువాత వల్లీ వివాహం, కుమారస్వామితో జరిగింది. ఇట్లా వీరిద్దరి ప్రేమ వివాహానికి కారకుడు గణపతి.
అరుణగిరినాథుడు, విఘ్నేశ్వర స్తుతి సూచించే తిరుప్పుగళ్ లోని త్రిపురాసుర సంహారం - వల్లీ వివాహంలో ఇతని సాహాయ్యాన్ని నుతించాడు.

కామెంట్‌లు