బుజ్జి గణపయ్య కథలు...:-సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 మనందరికీ బుల్లి కృష్ణుని అల్లరి చిలిపి చేష్టలు తెలుసు.కానీ ప్రధమదైవం గణపయ్య బాల్యంలో చేసిన అల్లరి తెలీదు అంతగా.కానీ శివ గణేశపురాణంలో చక్కగా వర్ణింప బడ్డాయి ఒకసారి వినాయకుడు ముని కుమారులతో కలిసి ఆడుకున్న తర్వాత బోలెడంత ఆకలేసింది అడవిలో ఏమి దొరక నది దగ్గర ఉన్నటువంటి ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు గౌతమ ఋషి ధ్యానంలో ఉన్నాడు ఆయన భార్య అహల్య వంట సిద్ధం చేసింది బుజ్జి గణపయ్య ఆకలితో అవన్నీ తీసుకుని వెళ్లి అడవిలో తిన్నాడు గౌతమ ఋషికి కోపం వచ్చి బుజ్జి వినాయకుని పార్వతి దేవి దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆమె ఒక గదిలో బంధించింది చిన్నవాడిని కొడుకుని గణేషుడు అక్కడ ఉన్న తల్లికి ఒడిలో ఉన్నట్లు ఆ తర్వాత తన వెనకాల నిలబడ్డట్లు అనిపించింది ఎక్కడ చూసినా కొడుకే కనపడటంతో పార్వతీదేవికి తను పిల్లవాడిని గదిలో పెట్టి బంధించినట్టు జ్ఞాపకం వచ్చి వెళ్ళింది అక్కడ బొజ్జలయ్యా తా డు విప్పుకుంటూ ఏడుస్తున్నాడు పార్వతి దేవికి జాలి వేసి వెంటనే ఎత్తుకుని ముద్దాడింది వినాయకుడు బాల్యంలో అమ్మానాన్నని సతాయించేవాడు ఒక కథ ప్రకారం అడవిలో ఆ బాబుని విడిచి పార్వతి వెళ్ళిపోయింది ఒక నక్క బుజ్జి బుజ్జి గణేశుని చూసి దగ్గరికి వెళ్తుంటే వేద వ్యాసుడు తండ్రి పరాశర మహర్షి ఆ చిన్న పిల్లల్ని చూశాడు ఒక తోడేలు కూడా ఆ శిశువు దగ్గరికి రావటం చూసి అయ్య అయ్యో ఇంద్రుడు నా తపస్సు భంగం చేయడానికి ఏదైనా వ్యూహం పన్నాడనుకుని పరాశరుడు అచ్చినారు దగ్గరికి వెళ్ళాడు ఆ తోడేలు వెంటనే మాయమైంది నాలుగు భుజాలతో రక్త వర్ణంతో ఏనుగు ముఖంతో బుజ్జి బుజ్జి పాదాలతో ఉన్న ఆ చిన్నారి ధ్వజం అంకుశం కమలం చిహ్నాలు ఉండటం చూసి ఈ చిన్న బాబు దేవుడే సామాన్యుడు సామాన్య పిల్లవాడు కాదు అని భావించాడు ఆ శిశువు పాదాలపై నుదుటిని ఆణించి నమస్కారం చేశాడు ఆపై ఆ శిశువుని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన భార్య వత్సల ఆ చిన్నారి బాబును చూసి ఎత్తుకొని ముద్దాడి త్రిలోక నాథుడు ఆ పసివాడు మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు అని మురిసిపోతుంది అలా ఆ భార్యాభర్తలు గణపతిని పెంచి పోషించారు కృతయుగంలో కశ్యపదితులకు మహోత్కట వినాయక పేరుతో పుట్టాడు దేవతాంతక నరాంతక అనే రాక్షసిని చంపి తన అవతార సమాప్తిని కావించాడు గణేశుడు ఇది మనకు తెలియని ఆయన భార్య లీలలు🌹
కామెంట్‌లు