ఆదిశన్కర భగవత్పాదుల అంతటి మహనీయుడు శ్రీ భాస్కరరాయలు వారు, అని లలితా పరా భట్టారిక చేత చెప్పబడిన శ్రీ భాస్కరరాయలవారి చరితము తెలుసుకుందాము.
"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
శ్రీ భాస్కరరాయలవారి జీవిత కాలంలో అనేక మహిమాన్వితమైన విషయాలు జరిగాయి. మనం మచ్చుకు ఒక నాలుగు మహిమా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.....
1.....జరిగిన ఒప్పందం ప్రకారం, గంగాతీరంలో, నేటి చౌషష్టీఘాట్ లో, సాయంత్రం సమయంలో నారాయణ భట్టు సారధ్యంలో పండితులు వేదిక ఏర్పాటు చేశారు. భాస్కరరాయలు గారు సాయం సంధ్యాదికాలు పూర్తి చేసుకుని వచ్చి, వేదికపైన కూర్చున్నారు. శక్తి పీఠమైన కాశీ విశాలాక్షి కి ఎదురుగా, అమ్మవారి ముఖం కనబడేలా, ధ్యానముద్రలో కూర్చున్నారు.
వేదిక దగ్గర వున్న ఒక 200 మంది పండితులు భాస్కరరాయలు గారు చెప్పే 64 కోట్ల యోగినుల వివరాలను రాసుకోవడానికి సిద్ధంగా వున్నారు. మన భాస్కరరాయలు గారు చెప్పడం మొదలు పెట్టారు. ఆయన నోటినుండి మాటలు నిశ్చల గంగా ప్రవాహం లాగా, ఎక్కడా తడబడకుండా వస్తూనే ఉన్నాయి, యోగినుల నామాలు, వారి వివరాలు. రాద్దామని కూర్చున్న పండితుల చేతులు అలసిపోయాయి. ఇంకా ఎన్ని నామాలను రాయాలో అనుకుంటూ ఆపసోపాలు పడుతున్నారు. భాస్కరరాయలు గారి వాక్ ప్రవాహం ఇప్పట్లో ఆగే సూచనలు కనబడట్లేదు. 64 కోట్ల యోగినుల వివరాలు, నామాలు కదా.
పరీక్ష పెట్టాలి అని వచ్చిన పండితుల సమూహం లో, కుంకుమానందనాథ స్వామి అనే మహనీయుడైన సన్యాసి వున్నారు. ఏమి జరుగుతుందో అని కుంకుమానందనాథ స్వామి కి అనుమానం వచ్చి, దివ్యదృష్టితో చూసారు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూసి ఆయన మహదానందం అనుభవించారు. నారాయణ భట్టు గారిని పిలిచి " ఇప్పటికే రాస్తున్న వారు అందరూ అలసి సొలసి వున్నారు.ఓటమి అంగీకరించమని" చెప్పారు. సాక్ష్యం కావాలి అన్నారు, నారాయణ భట్టు.
అప్పుడు కుంకుమానందనాథ స్వామి, అక్కడ వున్న అమ్మవారి అభిషేక జలం తీసుకుని భాస్కరరాయలు గారి కంటి రెప్పల పైన రాసారు. అలా రాయగానే ఒక మహాద్భుత దృశ్యం నారాయణ భట్టు కు కనిపించింది. ఆ దృశ్యం ఎలావుంది?
"శ్రీలలితా మహాత్రిపురసుందరి" అమ్మ ప్రత్యక్షంగా భాస్కరరాయలు గారి భుజాలపైన కూర్చుని కనిపించింది. భాస్కరరాయలు గారి పెదవులు కదులుతున్నాయి కానీ, మాట అమ్మల గన్న అమ్మ పలుకుతోంది.
ఈ దృశ్యం చూసిన తరువాత నారాయణ భట్టు నిజాన్ని తెలుసుకుని, భాస్కరరాయలు గారి పాదాలపై పడి, ఓటమిని అంగీకరించి, వారు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలను, సాంప్రదాయాలను ఒప్పుకుని, వాటి వ్యాప్తికి సహకరించారు.
..... రేపు వేరొక మహిమ చూద్దాము.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి