అక్టోబర్ 10 ,ప్రపంచ,మానసికారోగ్యదినోత్సవంశుభాకాంక్షలు అందిస్తూ.,
1..
సృష్టిలో మనిషికే,
ప్రత్యేకం మనసు!
మనసు దృష్టే ఇల ,
మానవ, తేజస్సు!
మనసు సృష్టే సకల ,
కార్యాల ఓజస్సు!
నిత్యం ఉత్సాహం,
మోసుకొచ్చే ఉషస్సు!
దిగులు పడితే ,
తొలగని తమస్సు!
2..
మనసుపై ఉంటే అదుపు !
విశ్వాన అసలైన గెలుపు
మనసుకు వస్తే దౌర్బల్యం!
జీవితం క్రమేపీ శిథిలం!
మనో నిబ్బరం మహాబలం!
3..
కలికాలం సహజం,
మనోవ్యాకులత!
అదే శరీర ఆరోగ్య,
బలహీనత!
క్షణం క్షణం పెరిగే ,
రంపం కోత!
శాంతి రాలిపోయే,
మామిడి పూత !
ప్రీతి లేని గృహాన,
బతుకే. రోత!
4.
మానసిక ఆరోగ్యమే,
మహాభాగ్యం!
నిత్య జీవితాన,
యోగాయే శరణ్యం!
ఆర్థిక దృష్టే కాక,
ఆధ్యాత్మిక దృష్టి పుణ్యం!
మనసు శూన్యం,
మహోన్నత స్థితి,!
మన వశం ఆశించే ,
ఓ సమతాస్థితి!
5.
మనసే శత్రువు మిత్రుడు!
మనసుతో స్నేహం చేయి!
అదే జీవితాన తరగని హాయి!
మరి ప్రతిరేయి పున్నమిరేయి!
మనసుజ్ఞానం ప్రజ్ఞానమోయి!
_________
మనమనసు.: -డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం, 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి