ఓ మా గోపాల.!:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్..9491387977 కల్వకుర్తి
 గోపాల గోపాల
మా మంచి గోపాల
వాయించు మురళి
మా వైపుకు మరలి !
          గోపాల గోపాల
        మా మువ్వ గోపాల
        చూపించు నీ లీల
        దీవించు ఈ వేళ  !
గోపాల గోపాల
ఓ బాల గోపాల
నీవేలే మా దైవం
నీవు రావాలి వైనం !
            గోపాల గోపాల
           ఆబాల గోపాల
            పికిపించదారి
           మా మంచి మురారి !
ఓ చక్రధారి
నీవు మమ్ముచేరి
ఆశీర్వదించు మమ్ము
శీఘ్రంగా నీవు రమ్ము !
             ఓ మా యశోద బాల
             మాకీ విషాదమేల
             మా వేదనను బాపు
              నీవే ఇక మా దాపు !
ఓ గోపిక రమణ
ఏది నీ ఆగమన
కనిపించగా రావా
కరుణించగ లేవా  !
               మా బృందావనమాలి
               మా గృహమందు తేలి
                అందుకో మా పూజ
                పసందుగా నీవు సోజ.


కామెంట్‌లు