నాలుకతో జాగ్రత్త!:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, 9966414580
నోరు అదుపు చేసుకో
మాట విలువ పెంచుకో
లేకపోతే మాత్రం
అనర్ధమని తెలుసుకో

హద్దులేని మాటలు
దాటునోయి కోటలు
జాగ్రత్త అవసరం
విరచునవే మనసులు

చెడు మాట చిన్నదైనా
మదిని గాయ పరచును
మాట్లాడకు కలనైనా
మనస్పర్థలు తెచ్చును

అగ్నివంటి నాలుకతో
ప్రతిరోజూ సమరమే
దైనందిన బ్రతుకులో
పెడుతుందోయ్! కలహమే


కామెంట్‌లు