అక్షరాల నిజం! నిజం!:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580
వికసించిన పూవులు
పరిమళమే పంచును
జ్ఞానవంతుల పెదవులు
తెలివిని వెదజల్లును

పచ్చని వృక్షాలే
కనువిందు చేస్తాయి
ప్రేమలొలుకు మనసులే
బంధాలు నిలుపుతాయి

ప్రతి దానికి సమయము
ఉంటుంది వాస్తవము
జారవిడచకూడదు
వస్తే అవకాశము

విలువైనది కాలము
అమూల్యం జీవితము
పోతే తిరిగిరాదు
శ్రేష్టమైన స్నేహము


కామెంట్‌లు