కోపమే విరోధి:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580.
నియంత్రిస్తే కోపాన్ని
ప్రదర్శిస్తే శాంతాన్ని
ఆనందమే సొంతము
ఆరోగ్యమే పదిలము

కోపంలో నిర్ణయము
ఎన్నడూ తీసుకోకు
క్షణికవేశమే ప్రమాదము
మానుకుంటే ప్రమోదము

ఎనలేని కోపంతో
తెచ్చుకోకు కష్టాలు
తెలివిలేనితనంతో
తెంచుకోకు బంధాలు

బద్ద శత్రువు కోపమే
తెచ్చిపెట్టు అనర్ధమే
దానితో పోరాటమే
అక్షరాల సత్యమే


కామెంట్‌లు