ఆడపిల్ల అదృష్టము:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,సెల్:9966414580
బాలిక బహుమానము
మితిలేని అదృష్టము
నట్టింట తిరిగితే
అంతులేని అందము

ఆడపిల్ల దీపము
ప్రేమకు ప్రతిరూపము
పున్నమి నాటి వోలె
శోభిల్లును సదనము

ఖరీదైన వజ్రము
చూడ ఆణిముత్యము
ధన లక్ష్మీ పోలిక
ధరణిలోన బాలిక

వివక్షత చూపొద్దు
ఇద్దరూ సమానము
నిర్లక్ష్యం కూడదు
జాగ్రత్త వహించుము
.

కామెంట్‌లు