చూడ ముచ్చటగా ఉండును:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, 9966414580
మిలమిల మెరిసే తారలు
టపటప కురిసే చినుకులు
నింగి తల్లి బంధువులు
చకచక కదిలే మొయిలలు

వెన్నెల వన్నెల సొగసులు
వెన్నలాంటి మనసులు
చూడ ముచ్చటగా ఉండును
కన్నోళ్ల సత్య ప్రేమలు

కిలకిల నవ్వే పిల్లలు
తళతళలాడే మేనులు
చూడ ముచ్చటగా ఉండును
కళకళలాడే ముఖములు

చుక్కలలాంటి బాలలు
చక్కెర వోలె పలుకులు
మొక్కలాగ చూడాలి
మక్కువ కల్గి ఉండాలి


కామెంట్‌లు