పిల్లలతో తప్పనిసరిగా మంచి మంచి కథలు పుస్తకాలు చదివించాలనేది ఆయన ఆశ. పుస్తకం పిల్లల్లో చైతన్యం పుట్టిస్తుందంటారాయన. సాహిత్య ఆనందాన్ని వీలైనంత ఎక్కువ మంది పిల్లల ప్రపంచంలో వ్యాప్తి చేయాలని ఆయన ఆరాటం. ఈ సదాశయ వ్యక్తి ఇంకెవరో కాదు, ఆయనే ఆంటోనియో లా కావా. ఇటలీలోని మారుమూల గ్రామాలకు పుస్తకాలు తీసుకువెళ్ళి అక్కడి ప్రజల్లో వాటిని చదివిస్తున్న గొప్ప వ్యక్తి!
పాఠశాల ఉపాధ్యాయుడిగా 42 సంవత్సరాలు పని చేసిన తర్వాత, ఆంటోనియో ఈ కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నారు.
2003లో, ఆయన ఒక చిన్న మూడు చక్రాల మోటార్‌బైక్‌ను మొబైల్ లైబ్రరీగా మార్చారు. దీనిని ప్రేమగా బిబ్లియోమోటోకారో అని పిలుస్తారు.
ఇటలీలోని బాసిలికాటా పర్వత ప్రాంతాలలో వాహనాన్ని నడుపుతూ ఆయా గ్రామాల్లోని పిల్లలను కలిసి పుస్తకాలను ఇచ్చి చదివిస్తున్నారు.
దానితో, ఆయన దక్షిణ ఇటలీలోని వివిధ ప్రాంతాలలో ప్రయాణిస్తారు. అందరికీ అందుబాటులో ఉండని పిల్లలకు కథల పుస్తకాలను తీసుకువెళ్తారు.
ప్రతి వారం, ఆంటోనియో వందల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అదీనూ ఒక లక్ష్యంతో ఈ పుస్తకపఠనాసక్తిని జనంలో పెంపొందిస్తుంటారు. యువ మనస్సులలో చదవాలనే ప్రేమను రేకెత్తించడం ఆయన ముఖ్య ఉద్దేశ్యం. ఆయన మొబైల్ లైబ్రరీలో దాదాపు ఏడు వందల పుస్తకాలు ఉంటాయి.
ఆంటోనియో ముఖాముఖిగా పంచుకునే కథల పుస్తకాలు సేవ సామాన్యమైనది కాదు. అదీనూ నిస్వార్థంగా. ఈ బిబ్లియోమోటోకారో ( ఒక మొబైల్ బుక్ లైబ్రరీ) ఆశయం మహత్తరమైనదని పలువురి అభిప్రాయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి