శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం
 ఓం దక్షిణామూర్త్యై నమః
ఓం సిద్దిలక్ష్మ్యై నమః
ఓం బుద్దిలక్ష్మ్యై నమః
ఓం విద్యాలక్ష్మ్యై నమః

శ్లోకం:
నమోస్తు హేమాంబుజ పీఠికాయై 
నమోస్తు భూమండల నాయికాయై |
నమోస్తు దేవాది దయాపరాయై 
నమోస్తు శార్జ్గాయుధ వల్లభాయై|| 13 ||*

తా.:
అమ్మా బంగారు పద్మము పీఠముగా కలిగిన నీకు నమస్కారము. ఈ భూమండలానికి నాయిక వైన నీకు నమస్కారము. దేవతలందరిపైనా కూడా దయను చూపగలిగిన నీకు నమస్కారము. శార్న్గము అనే ధనుస్సును పట్టిన విష్ణుమూర్తి కి అనురాగమును పంచే దానవు అయిన నీకు నమస్కారము.
భావము:
అమ్మా నీవు సర్వమంగళవు. బంగారు పద్మమునే నీ ఇష్టముగా చేసుకున్న దానివి. ఈ సకల చరాచర జగత్తును నడిపించే కథానాయికవు. దేవతలు, దానవులు, పశు పక్ష్యాదులు, ఈ జగత్తులోని అన్ని జీవరాసుల మీద దయను మాత్రమే చూపించే దయారూపానివి నీవు. జగత్ప్రభువు, జగద్భర్త అయిన నారాయణుని కి నిత్యమూ సంతోషాన్ని పంచే ప్రియురాలివి. ఇటువంటి నీకు త్రికరణశుద్ధిగా నమస్కరిస్తున్నాను.!!
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు