కీటకాల బడాయి:- అరుణ.బట్టువార్. -జడ్పిహెచ్ఎస్.ఇంద్రవెల్లి.-జిల్లా.ఆదిలాబాద్
 మంగతాయారు తనకున్న కొద్దిపాటి స్థలంలో ఇంటి ముందర ఒక  చిన్ని పూల తోటను పెంచుకుంది. ప్రతి రోజు సాయంత్రం సంధ్యా సమయ వేళలో చిన్ని కీటకాలాన్ని అచ్చట సమావేశమై ముచ్చటలాడుకునేవి. ఒకరోజు అలా ముచ్చటాడుకుంటూ వాటి అందచందాలు అవే  పొగుడుకుంటూ మానవులకు చేస్తున్నమేలు గురించి మాట్లాడుతూ ఎవరి గొప్ప అవిచెప్పుకుంటున్నాయి. 
సీతాకోక చిలుక లేచి ఇలా మాట్లాడ సాగింది.  మేమెంత అందంగా ఉంటామో ఎన్ని రంగుల్లో ఉంటామో మా ద్వారా తోటకే అందం. చూశారా మంగతాయారు తోటకు మేమెంత అందాన్ని తెచ్చామో? మేము పూలపై వాలితే ఆ పువ్వులకే అందం  అంది సీతా కోకచిలుక అప్పుడు ఆరుద్ర పురుగు  లేచి ఇలా అంది. నేను కూడా ఎర్రగా ముద్దుగా గమ్మత్తుగా ఉంటాను. నువ్వు తోటకు అందం తెస్తే నేను పొలానికి అందం తెస్తాను. నేనేమైనా తక్కువా?  నన్ను చూడండి అంది. అంతలో కరెంటు పోయింది తోటంతా చిమ్మ చీకటి అయ్యింది. అప్పుడు మిణుగురు పురుగు లేచి  ఇలా అంది. మీరు తెచ్చే అందం వేరు నన్ను చూడండి. నేనెంత మిళ మిళ మెరిసిపోతానో. నేనెప్పుడూ చీకటిని చేదించి. వెలుగులు జిమ్ముతూ ఉంటాను. ఇప్పుడు చూడండి నా ద్వారా తోటకు ఎంత అందం వచ్చిందో. అంటూ తోటలో రయ్యు రయ్యు మంటూ తోటంతా తిరగసాగింది. అప్పుడు బొద్దింక లేచి హే హే ఆపండి మీ బడాయిలు. ఎప్పుడూ మీ గొప్పలు మీరు చెప్పుకోవడమేనా? అదిగో అటు చూడండి ఆ చిటారు కొమ్మన గల ఆ పెద్ద తేనె తెట్టును . అచట వేల తేనెటీగలు ఉన్నాయి . అప్పటినుండి  అవి మన సంభాషణ వింటున్నాయి. కానీ ఒక్క తేనెటీగ అయిన మీ సంభాషణలో పాల్గొందా? ఏ ఒక్క తేనెటీగ అయిన మీలా బడాయిలకు పోయిందా? చిటారు కొమ్మల్లో తేనె తెట్టును  పెడుతూ కమ్మని తీయని తేనెను మానవాళికి అందిస్తున్నాయి.ఆ స్వచ్ఛమైన తేనె మానవాళికి ఎంత మేలు చేస్తుందో? అవి ఇలాగే మీలాగే చెప్పుకుంటున్నాయా? తమ అందాన్ని పొగుడుకుంటున్నాయా? మన అందాన్ని మనం చేసే సేవను మనది మనం పొగడుకోవడం కాదు.  దానిని నలుగురు గుర్తించి పొగిడినప్పుడు మన సేవకు గుర్తింపు. ఇకనుండి మీలోని కల్మషాన్ని వదిలి. స్వచ్ఛంగా మంచి మనసుతో మెలగండి. మానవాళికి మీ సేవనందించండి. అని చెప్పింది. అప్పుడు మిగతా కీటకాలన్నీ బొద్దింక చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించి. అప్పటినుండి గొప్పలకు పోకుండా మామూలుగా మసులుకోసాగాయి.

కామెంట్‌లు