ఒక ఆలోచన : - ప్రహ్లాద్,జెడ్.పి.హెచ్.ఎస్,తనగల, జోగులాంబ గద్వాల జిల్లా.
 ప్రస్తుతం మన దేశంలో.... పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద వేదికలు ఏర్పాటు చేసి, "నా దేశ ముద్దు బిడ్డలారా!! మీ అందరికీ శిరస్సు వంచి, పాదాభివందనములు చేసుకుంటున్నాను. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. దీనికి కారణం... విదేశీ వస్తువులను వాడకం అని మొదలు పెట్టి, అమెరికా దేశ అమెజాన్ ద్వారా ఏ వస్తువులను తెప్పించుకోవద్దు. దాని వల్ల అమెరికా కోట్లానుకోట్ల ఆస్తులను జమ చేసుకుంటుంది. అంతేకాక,వాట్సప్ ఉపయోగించవద్దు.."ఈ విధంగా ఎన్నో ఎన్నెన్నో విషయాలు చెప్తుంటారు. 
ఇక వారి ప్రసంగాలు పలు దేశ ప్రాంత వార్తాపత్రికల లో పెద్ద పెద్ద అక్షరములతో కొనియాడుతూ వ్యాసాలు... వారి కల్పితాలు రాయటం... టీవీ లలో వార్తా ప్రసారాల హోరు... ఈ విధంగా 2-3 రోజుల పాటు వారికీ పండగే. ఆ బడా నాయకులు బొమ్మల కు చాంతాడంత పూ మాలలు, గజ మాలలు వెలుస్తాయి. దేశమంతా  డిజె ల హోరూ...సంబరాలు...పాలాభిషేకాలు... పాదాభివందనాలూ... 
మరి ప్రభుత్వం అమెజాన్, వాట్సప్ లను కఠిన నిర్ణయాలు తీసుకుని రద్దు చేస్తారా?! చెయ్యరు.చచ్చినా చెయ్యరు. 
ఎందుకు? ఆ నిర్ణయాల వల్ల, వారి స్విస్ బ్యాంకు లను ఎవరు నింపేది?
ఈ బడా నాయకుల మాటలు విని, వీరాభిమాన చోటా నాయకులు రాష్ట్రాలలో సభలూ....వీరూ ఋచి కోసం మసాలా నింపి, కోకకోల,థమ్సప్ వగైరాలు మానేద్దాం... అని రెచ్చిపోయిన ప్రసంగాలు... వారికీ పూలమాలలు..వగైరాలు
ఇవన్నీ వింటున్న చోటా చోటా గల్లీ నాయకులు గల్లీలలో ప్రసంగాలు.. ఇంకాస్త ఋచి పెంపుకు కొన్ని బిస్కెట్లు, బర్గర్లు, పిజ్జాలు మానేయమని. ఇంకా కొసమెరుపు గా నెయ్యి కలిపి, అంటారు... "విదేశీ వద్దు-స్వదేశి ముద్దు"ఇంకేం?వారికీ అలంకారాలు.. వారి ఆనందం... ఇంత మంది వింటున్నారు.... ఓ పది మంది అయినా,మారుతారు కదా అని. 
ఇవన్నీ వింటున్న ఒక ఉద్యోగి, తన వాట్సప్ సమూహాలకు మెసేజ్ పాస్ చేస్తాడు. నా ఈ చిన్న ఉడతాభక్తి అనుకుని, అదే విషయాన్ని ఇంట్లో చెప్తాడు. 
చివరగా... అసలు కథ. సదరు ఉద్యోగి, తన చరవాణి 10 సంవత్సరములు వాడాను.సరిగ్గా చార్జింగ్ కాబట్లేదు. దసరా వస్తుంది కదా... కాస్త ధరలు తగ్గుతాయి అని 10 రోజు ల ముందే మంచి ఫ్యూచర్ లతో ఉండే 20 వేలలో చరవాణి ని"అమెజాన్" లో బుక్ చేసుకుంటాడు. చరవాణి 2 రోజుల్లో ఇల్లు చేరుతుంది. ఈ చిన్న పనికై ఏ పట్టణమో..ఇంకెక్కడికో ఎందుకు వెళ్ళాలి?... 
సరే చరవాణి ఇల్లు చేరింది. ఇల్లంతా సంబరమూ...మిఠయిలూ.మరి చరవాణి ని అప్పుడే వాడతాడా?! అస్సలే వాడడు.
పండగ రోజున లక్ష్మీ మాత పూజలూ...బుజ్జి బుజ్జి అలంకరణ లు..ఇక చరవాణి సంతోష ప్రయాణం.. డింక్చిక....
డింక్చిక...💃💃💃

కామెంట్‌లు