సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము పంచమాశ్వాసము:* 26వ రోజు*
పాండురాజు మరణం మాద్రి సహగమనం
పాండురాజు భార్యలతో పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒక వసంత కాలం సమయంలో ప్రకృతి మనోజ్ఞంగా ఉన్న సమయంలో పాండురాజు మాద్రి సౌందర్యానికి ఆకర్షితుడై బలవంతంగా ఆమెను చేరాడు. ఆ పై శాపకారణంగా మరణించాడు. ఇది చూసిన మాద్రి భయంతో ఒణికి పోతూ భర్త శవాన్ని చూసి రోదించ సాగింది. అక్కడకు వచ్చిన కుంతీ దేవి జరిగిన విషయం గ్రహించి సహగమనానికి సిద్దపడింది. కానీ మాద్రి అందుకు అంగీకరించలేదు. భర్త తన వలన మరణించినందున తాను సహగమనం చేస్తానని చెప్పి తనకంటే సమర్ధురాలైన కుంతికి ఐదుగురు పుత్రులను కాపాడే బాధ్యతను అప్పగించి తాను భర్తతో సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడి మునులు సహకరించి వారిని తీసుకుని హస్థినాపురానికి వెళ్ళారు. పాండురాజు కుమారులను చూడటానికి హస్థినాపురం ప్రజలు తరలి వచ్చారు. దుర్యోధనుడు తన తమ్ములతో పురోహిత సమేతంగా ఎదురువచ్చి వారిని సాదరంగా తీసుకు వెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, అంబిక, అంబాలిక వారికెదురు వచ్చి మునులకు నమస్కరించి కుంతీదేవిని ఓదార్చి పాండు కుమారులను ఎత్తుకుని ముద్దాడారు. మునులు కుంతీ సహితంగా పాండు కుమారులను వారికి అప్పగించి పాండురాజు మరణ వార్త మాద్రి సహగమన వార్తను చెప్పారు. ఆ తరువాత భీష్ముడు పాండుసుతులతో పాండురాజుకు ఉత్తర సంస్కారం చేయించాడు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన వ్యాసుడు తన తల్లి సత్యవతితో "అమ్మా దృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు. వారి ఆగడాలు మీరు చూడలేరు కనుక మీరు తపోవనానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి "అని చెప్పాడు. సత్యవతి అంబిక, అంబాలికలను తీసుకుని తపోవనానికి వెళ్ళింది. కాలక్రమేణా ఆ ముగ్గురు స్వర్గస్థు లైయ్యారు. ధృతరాష్ట్రుడు తన కుమారులను తమ్ముని కుమారులను భేదభావం లేకుండా పెంచుతున్నాడు. భీముడు తన బలంతో దుర్యోధనుని తమ్ములను ఆటలలో ఓడిస్తూ ఉండటం దుర్యోధనునికి సహింపరానిది అయింది. అతని బలసంపన్నతకు ఈసు భయంకలిగిన దుర్యోధనుడు మేనమామ తమ్ముడు దుశ్శాననుడు, శకునితో చేరి కుటిలోపాయాలు ఆలోచించ సాగారు. భీముని చంపి ధర్మరాజుని చెరలో పెట్టితే కానీ తనకు రాజ్యం దక్కదని అనుకున్నాడు. దీనికి శకుని వంత పాడాడు. ఒకరోజు పిల్లలంతా జలక్రీడలలో మునిగి తేలి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో దుర్యోధనుడు తమ్ములతో చేరి భీముని తీగలతో కట్టించి గంగానదిలో త్రోయించాడు. భీముడు ఒళ్ళు విరవగానే ఆ తీగలన్నీ పటాపంచలైనాయి. మరొక రోజు దుర్యోధనుడు సారథిని ప్రేరేపించి భీముని నల్ల త్రాచులతో కరిపించాడు. భీముని వజ్రశరీరాన్ని ఆ పాముకోరలు ఛేదించ లేకపోయాయి. ఒకరోజు దుర్యోధనుడు భీమునికి కాలకూట విషం ఆహారంలో కలిపి తినిపించాడు. భీ ముడు ఆ ఆహారాన్ని జీర్ణించుకున్నాడు. భీష్ముడు కుమారులందరికి విద్యను మొదట క్రుపాచార్యుడు వద్ద ఆ తరువాత ద్రోణాచార్యుని వద్ద నేర్పించ సాగాడు. అప్పుడు జనమేజయుడు మహర్షీ క్రుపాచార్యుడు, ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతం తెలుపగలరా అని వైశంపాయనుని అడిగాడు.
కౌరవుల నామధేయాలు
|1. దుర్యోధనుడు, 2. దుశ్శాసనుడు, 3.దుస్సహుడు 4.దుశ్శలుడు, 5.జలసంధుడు, 6. సముడు, 7.సహుడు, 8. విందుడు, 9. అనువిందుడు, 10.దుర్దర్షుడు, |11.సుబాహుడు, 12.దుష్పప్రదర్శనుడు, 13.దుర్మర్షణుడు, 1 4.దుర్ముఖుడు, 15.దుష్కర్ణుడు,16. కర్ణుడు,17. వివింశతుడు,18. వికర్ణుడు,19. శలుడు 20.సత్వుడు, |21.సులోచనుడు, 22.చిత్రుడు, 23.ఉపచిత్రుడు, 24.చిత్రాక్షుడు, 25.చారుచిత్రుడు, 26.శరాసనుడు, 27.దుర్మధుడు, 28.దుర్విగాహుడు, 2 9.వివిత్సుడు, 30.వికటాననుడు, |31.నోర్ణనాభుడు, 32.సునాభుడు, 33.నందుడు, 34.ఉపనందుడు, 35.చిత్రాణుడు, 36.చిత్రవర్మ, 37.సువర్మ, 38.దుర్విమోచనుడు, 39.అయోబాహుడు, 40.మహాబాహుడు, |41.చిత్రాంగుడు, 42.చిత్రకుండలుడు, 43.భీమవేగుడు, 44.భీమలుడు, 45.బలాకుడు, 46.బలవర్ధనుడు, 47.నోగ్రాయుధుడు, 48.సుషేణుడు, 4 9.కుండధారుడు, 50.మహోదరుడు, |51.చిత్రాయుధుడు, 52.నిషింగుడు, 53.పాశుడు, 54.బృందారకుడు, 55.దృఢవర్మ, 56.దృఢక్షత్రుడు, 57.సోమకీర్తి, 58.అనూదరుడు, 59.దృఢసంధుడు, 60.జరాసంధుడు, |61.సదుడు, 62.సువాగుడు, 63.ఉగ్రశ్రవుడు, 64.ఉగ్రసేనుడు, 65.సేనాని, 66.దుష్పరాజుడు, 67.అపరాజితుడు, 68.కుండశాయి, 69.విశాలాక్షుడు, 70.దురాధరుడు, |71.దుర్జయుడు, 72.దృఢహస్థుడు, 73.సుహస్తుడు, 74.వాయువేగుడు, 75.సువర్చుడు, 76.ఆదిత్యకేతుడు, 77.బహ్వాశి, 78.నాగదత్తుడు, 79.అగ్రయాయుడు, 80.కవచుడు, |81.క్రధనుడు, 82.కుండినుడు, 83.ధనుర్ధరోగుడు, 84.భీమరధుడు, 85.వీరబాహుడు, 86.వలోలుడు, 87.రుద్రకర్ముడు,88.దృఢరదాశ్రుడు, 89.అదృష్యుడు, 90.కుండభేది, |91.విరావి, 92.ప్రమధుడు, 93.ప్రమాధి, 94.దీర్ఘరోముడు, 95.దీర్ఘబాహువు, 96.ఊడోరుడు, 97.కనకద్వజుడు, 98.ఉపాభయుడు, 99.కుండాశి, 100.విరజనుడు.  
నూట ఒకటవ కుండనుండి దుస్సల అనే ఆడపిల్ల జన్మించింది.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు