సామెత-5:-అక్క ఆరాటమే గాని- బావ బాగుపడేది లేదు
**************************************************
"ఏం మడుసులో ఏమో అవ్వా! రంగక్కది ఒక్క రంధి గాదు.తల్సుకుంటే కడుపు తరుక్కుపోతుంది. నెత్తిన యిత్తులు బడ్డ కానుంచి దాని కట్టాలు కట్టాలు గావు. ఎప్పుడు దేవునికి సుతి ముడుతయో!." చెప్పి జిర్రున చీది, కళ్ళు తుడ్సుకుంటున్న చంద్రమ్మను ఊకోబెడుతూ...
"ఏం జేస్తం శెల్లె.దాని కర్మ అట్ల గాలింది."అక్క ఆరాటమే గాని- బావ బాగుపడింది లేదు. నేను సుత సూత్తనే ఉన్న.
"దాని ఆరాట పోరాటాల్ని ఏనాడైనా బావ పట్టించుకున్న పాపాన పోలేదు.తాగుడు ఒంటికి మంచిది గాదంటే ఇన్నడా? ఇల్లు గుల్లాయె. ఇప్పుడు తాగి తాగి ఒళ్ళు గుల్లాయె.ఇంకా మంచిగ మార్సుకోవాలని బతికించుకోవాలనే తండ్లాటతో అటు గుళ్ళ సుట్టూ,ఇటు ఆసుపత్రి సుట్టు తిరగబట్టె.
అదంతా పొల్లుబోకుండా విని"అవ్వా! అవ్వా! గిదే మాట మా సార్లు సుత గిట్లనే అంటుండ్రు. అక్క ఆరాటమే గని- బావ బాగుపడేది లేదు అన్నట్టు "సార్ల ఆరాటమే గని పోరలు బాగుపడేది లేదు. ఎంత జెప్పిన ఒక్క పోరడు చదువు చెవికెక్కించుకోడం లేదు. బడికి సరింగ వచ్చుడు లేదు.చెప్పిన పాఠాలు సదువుడు లేదు.రేపు రేపు గీళ్ళు ఇంగెట్ల తయారైతరో" అని.
అవును మల్ల. సార్లు జెప్పింది బుద్ధిగ ఇనుకుంటే బాగుపడతరు.చెప్పితే యినకుంటే ఇంగ సెడంగ సూసుడే వుంటది మరి."
"నేనట్ల గాదవ్వా! మంచిగ సదూకుంట" వయ్యి ముందేసుకుంది భూలచ్మి.
ఎవరికి వారు సోవి తెచ్చుకోవాలి గని ఇతరుల ఆరాటం ఏం పనిజేస్తది? అనే అర్థంతో ఈ "అక్క ఆరాటమే గని- బావ బాగుపడేది లేదు అనే సామెతను వాడుతారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి