పూల తోటలు!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
తెగిన నదుల్ని కలుపుతున్నాను. 
పగిలిపోయిన 
మధుల్ని అతికిస్తున్నాను. 

జారిపోయిన కాలాన్ని 
కూర్చుతున్నాను.
అలుముకున్న చీకట్లో 
దీపం వెలిగిస్తున్నాను.!!!

తప్పిపోయిన మార్గాన్ని 
పునర్మిస్తున్నాను. 
ఆగిపోయిన దారిని 
పొడిగిస్తున్నాను.!!!!

పచ్చని జీవితాల కోసం 
కన్నీరు వర్షం కురిపిస్తున్నాను.
విరిగిన చూపులను 
కంటి ఇంటిలో దాస్తున్నాను.!!

కత్తులతో నాలుకలు కోస్తున్న 
ముత్యాల మాటలు రాలుస్తున్నాను.!!
విషపురుగుల్లా కాటేస్తున్న 
ఏతేనెటీగల్లా మెలుగుతున్నాను.!!

మంటల్లో కాలుస్తున్న 
మంచులా కరుగుతున్నాను.!!
వేట కోసం అడవుల్ని సృష్టిస్తున్న 
సీతాకోచిలుకల కోసం 
పూల తోటలను పెంచుతున్నాను.!!

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు