జన్మనిచ్చి తమ జీవిత మాధుర్యాన్ని
పిల్లల ఉన్నతికై త్యాగం చేసిన
తల్లిదండ్రులను వృద్ధాప్యంలోపెట్టి సరిగా చూడక
అవస్థలు పాలు చేసే నేటి మనుషులు.
పాశ్చాత్య వ్యామోహంలో పడి
మాదక ద్రవ్యాలకు అలవాటుపడి
పబ్ ల వెంట క్లబ్ ల వెంట తిరుగుతు
అనైతిక సంఘటనలకు పాల్పడుతున్న యువత.
ధనమే జగతికి మూలమని
కన్నవారిని తోబుట్టువులను వదలి
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ప్రజలు.
కాదేది కవితకనర్హం అన్నట్లు విద్యా, వైద్యం, శాస్త్ర రంగాలలో కూడా
నేటి సమాజాన జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు.
ఓ మనిషీ తెలుసుకో నైతికవిలువలకు
తిలోదకాలిస్తే
నీ వినాశనానికి సోపానాలని ఏర్పర్చుకున్నట్లే
అనురాగ ఆప్యాయతలతో
నలుగురుతో కలసి
మానవజీవితాన్ని సుఖమయం చేసుకుని
ఆదర్శ జీవితాన్ని కొనసాగించు.....!!
.......................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి