సుగుణ సాహితి సమితి సిద్దిపేట వారు నిర్వహించిన ఉగాది బాలల కథల పోటీ 2025 లో విజేతలుగా నిలిచిన 27 మంది విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం బుధవారం 8 వ తేదీన సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి డా. చెన్నయ్య చేతుల మీదుగా జరుగుతుందని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.బహుమతుల ప్రదానం తో పాటు విద్యార్థులు కథలు వ్రాసేలా ప్రోత్సహించిన 29 మంది ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం ఉంటుందని అన్నారు. సుగుణ సాహితి సమితి అధ్యక్షులు మొసర్ల మాధవరెడ్డి అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్యక్షులు డా. మట్ట సంపత్ కుమార్ రెడ్డి,చిన్నకోడూరు, కోహెడ మండల విద్యాధికారులు సత్తు యాదవరెడ్డి, రాళ్లబండి పద్మయ్య,ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణా రెడ్డి,బాల సాహితి వేత్త కందుకూరి భాస్కర్,ప్రతిభ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దాతారు సూర్యప్రకాష్, కవి ఉపాధ్యాయులు వేల్పుల రాజు పాల్గొంటారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు,బాల సాహిత్యాభిమానులు హాజరు కావాలని కోరారు.
కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి