శ్రీకృష్ణుడిని ప్రేమించే ఒక స్త్రీ ద్వారకలో ఆయనను కలిసింది. ఆమె చాలా పేదరాలు. ఆమెకు తల్లిదండ్రులు లేరు.
ఆమె కృష్ణుడికి కొంత సేవ చేయాలనుకుంది. కానీ కృష్ణుడు ఆమెకు ఒక సంచీ ఇచ్చి, “నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని తీసుకురా. అంతే చాలు. మన కళ్ళు తప్ప మరెవరి కళ్ళు ఈ సంచీని చూడవు!” అని అన్నాడు.
శ్రీకృష్ణుడు తనకు మురికి సంచిని ఇస్తాడని ఆ స్త్రీ ఊహించలేదు.
ఆ స్త్రీ దానిని తనతో తీసుకెళ్లి లోపల ఏముందో చూడాలనుకుంది. కానీ అది చాలా గట్టిగా కట్టేసుంది. ఆమె ఆ ముడిని విప్పలేకపోయింది. ఆ సంచీ లోపల ఉన్నది తాను చూడకూడదని కృష్ణుడు అనుకున్నాడు కనుకే గట్టిగా కట్టేసిచ్చాడు అనుకున్న ఆ స్త్రీ అందులో ఏముందో చూడాలనే ఆలోచనను మానుకుంది.
కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం దానిని ఆయన వెళ్తున్న చోటికల్లా మోసుకుంటూ వెళ్ళిందామె..
కాలం గడుస్తున్న కొద్దీ, ఆమె కొన్ని క్షణాల కంటే ఎక్కువ సేపు ఆ సంచీని మోయ లేకపోయింది.
“కృష్ణా, నేను నిన్ను సేవించడానికి వచ్చాను. నేను మోయలేని మురికి సంచీని నువ్వు నాకు ఇచ్చావు. కరుణామూర్తికి ఇది తగునా? ఏమిటీ పరీక్ష?” అని ఆమె ఒకింత కోపంగా అడిగింది.
అప్పుడు కృష్ణుడు "నా బలం నీ బలహీనతలోనే ఉంది. చింతించకు. నేను నీ వైపు ఉన్నాను. నేను చెప్పినంత కాలం దానిని మోస్తూ రా" అని కృష్ణుడు అన్నాడు.
అయితే కొన్ని సమయాలలో, ఆమె దానిని ఎత్తలేనప్పుడు, కృష్ణుడు కూడా ఓ చేయందిస్తూ తన వంతుగా ఆ భారాన్ని పంచుకున్నాడు.
ఒక రోజు, వారు ఓ చోటుకి వెళ్ళవలసి వచ్చింది. అంతట కృష్ణుడు "నువ్వు ఇప్పటి వరకూ తగినంత మోసావు. ఆ సంచీని కింద పెట్టు!!" అని అన్నాడు.
కృష్ణుడి మాటగా ఆమె ఆ సంచీని పరమాత్మ ముందు ఉంచింది.
"సంచీ లోపల ఏముందో చూద్దాం?" అని కృష్ణుడు నవ్వుతూ అడిగాడు.
సంచీలో ఏముందో చూడాలనే ఆత్రుతతో ఉన్న ఆమె, "చూద్దాం కృష్ణా...త్వరగా" అని చెప్పింది.
కృష్ణుడు తన వేణువును ఆ సంచీమీద అటూ ఇటూ తిప్పి వాయిస్తాడు. సంచీకున్న ముళ్ళు తమంతట తామే విప్పుకున్నాయి. సంచీ తెరుచుకుంటుంది. అందులో మొదటగా గడ్డి కనిపిస్తుంది. కానీ గడ్డి మధ్య, అరుదైన రత్నాలు, వజ్రాలు, బంగారు నాణేలు, బంగారు ఆభరణాలు ఇలా అనేకం ఉన్నాయి. అవన్నీ దేవలోకంలోని ఓ చెట్టు మాత్రమే ఇవ్వగల నిధి!!
"ఇంతకాలం నువ్వు ఓపికతో నిరీక్షించినందుకు నీకు నేనిచ్చే బహుమతి. తీసుకో...అందులోనివన్నీ నీకే!!" అంటాడు కృష్ణుడు.
ఆమెకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంతో కూడిన సంతోషం. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
“కృష్ణా……. నన్ను క్షమించు,” అని ఆమె పరమాత్మ పాదాలపై పడిపోతుంది.
“నువ్వు నాకు గొప్ప నిధి ఇచ్చినప్పటికీ, నేను తెలియకుండానే ఇంతకాలం నీ గురించి తప్పుగా ఊహించాను. మనసులో ఏమేమో అనుకున్నాను. నేను నీ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, నిన్ను అనుమానించకపోతే, ఈ నిధి భారాన్ని మోయడం నాకు ఆనందంగా ఉండేది. నిన్ను అనరాని మాటలన్నాను. కోపగించుకున్నానుకూడా…” అని ఆమె అంటుండగా కృష్ణుడు తనదైన శైలిలో చిన్న నవ్వు నవ్వాడు.
ప్రతి భారాన్ని దేవుడు దానిని మోసే వారి పట్ల చాలా శ్రద్ధతో, ప్రేమతో చూస్తూ ఉంటాడు. మనం వాటిని భారంగా భావిస్తే, అవి భారాలే. అలాకాకుండా వాటిని సంపదగా భావిస్తే, అవి సంపదలే. ఏదైనా అది మన చేతుల్లోనే ఉంది. మనం భావించే తీరులోనే తేడా అంతా.
మనం ఏమి మోయగలమో భగవంతుడికి తెలుసు. దేవుడు మనం మోయగల భారాన్ని మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఆయనను పూర్తిగా నమ్మాలి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి