* ఎలుగెత్తి చాటాలి *:- కోరాడ నరసింహా రావు

 ఓ బా లి కా...! 
   నీ వే  భావి తరాల 
యేలిక!! 
   వైషమ్య రహిత నవ సమాజ నిర్మితవు నీవే... 
    వివక్షను రూపు మాపగల సత్తా  నీ కున్నది! 
    తర తరాల పోరాట పటిమ నీకున్నది !! 
   అనేక సమస్యలతో సు దీర్ఘ కాలం, రాటు దేలి నీ వున్నావు! 
      అన్ని రంగాలలో అధిగ మించి నీవు నిలిచితివి ! 
     నీ మాతృత్వము, దయ, ప్రేమ, సేవ లే.... 
   నీ బలహీనతలై....నిన్నిం  తవరకు అణచి ఉంచినవి!
   ఐతేనేమ్... ఆవే నిన్నీఇల దేవతను చేసినవి!! 
   పొగడ్తలకుపొంగిపోయి, నీ ఆస్తిత్వమును కోల్పోక 
   నీ ఔన్నత్యమునూ నిరూ పించు కోవలసిన అగస్యము దాపురించినది
   లే.... నీ నిజ స్థితిని నీవు ప్రకటించు ! నీ సమా నత్వమే కాదు... నీ ఆధిక్య తను ఈ ప్రపంచంఎలుగెత్తి
చాటాలి...!! 
     *******
కామెంట్‌లు