గుర్రం జాషువా పై కవితా గానం పోలయ్య కవికి ఘన సన్మానం
శారదా కల్చరల్ లైవ్ స్టూడియో హాల్లో ఆదివారం  సంగీతసాహిత్య సాంస్కృతిక సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో మైన్స్ డైరెక్టర్ డాక్టర్ వి.డి  రాజగోపాల్ అధ్యక్షతన మహర్షి వాల్మీకి... మహాత్మా గాంధీ...కృష్ణశాస్త్రి...సాలూరిరాజేశ్వరరావుల...గుర్రం జాషువా...జయంతి సందర్భంగా సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవి రచయిత పోలయ్య కవి కూకట్లపల్లి =
"అగ్ని పుత్రుడు గుర్రం జాషువా" శీర్షికన...
"పేదరికం గురువుగా అక్షరం ఆయుధంగా
"నాటి మేటి కవులైన విశ్వనాథ కృష్ణ శాస్త్రి
"శ్రీశ్రీలతో పోటీపడి పద్యబాణాలతో విప్లవ "జ్వాలలు రగిలించిన...అక్షర అల్లూరి"...

"అంబేద్కర్ ఆశయాల జ్యోతిని
"విశ్వమంతా వెలిగించిన"సమతావాది"
"కులం కరాళ నృత్యం చేస్తున్నా
"ఏడు ఖండకావ్యాలతో ఆత్మగౌరవరాగం "ఆలపించిన...నవయుగ కవి చక్రవర్తి"...

"అస్పృశ్యత మంటల్లో దహించుకుపోయే
"తన జాతికి "అక్షరార్చన" చేసి గబ్బిలంతో
"కాళిదాసు మేఘ సందేశంలా...
"పరమేశ్వరునికి పక్షి సందేశాన్ని "
"పంపిన "అక్షరదాసు...అక్షర పిపాసి"...

"కలం కత్తితో...పద్య బాణాలతో...
"కులవిషవృక్షాన్ని కూకటి వేళ్ళతో "పెకలించివేసిన...సాహస వీరుడు
"సాహితీ సమరయోధుడు..సంఘసంస్కర్త

"పీడిత ప్రజల పిల్లనగ్రోవిగా"
"కార్మిక...కర్షక...రైతు కూలీల...
"కన్నీటి గాథల్ని ఆలపించిన...కవికోకిల...
"విధివంచితుల విషాద గీతాలను
"విశ్వ వేదికలపై వినిపించిన...విశ్వనరుడు

"కళాప్రపూర్ణ పద్మభూషణ్ వంటి ఎన్నో
"ప్రతిష్టాత్మకమైన అవార్డులందుకున్నా...
"శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిచే "గండపెండేరాన్ని"తొడిగించుకున్నా...

"రోజు తన గుండెల్లో గుచ్చుకున్నది
"కులం కత్తేనని" తన చుట్టూ
"మతాల ముళ్ళని".."కులాల కుళ్ళని"...
"కుమిలిపోతూ చిట్టచివరి శ్వాస వరకు
"కులమత రహిత నవసమాజం" కోసం
"తపించిన....సమానత్వ సౌభ్రాతృత్వ
"సాహితీ శిల్పాలు" చెక్కిన...
"అక్షర శిల్పి...అక్షర కిరణం" మరణంలేని
"మహాకవి" గుర్రం జాషువా..! అంటూ
"ఆ "అక్షర ఋషికి" అక్షర నిరాజనం"
సమర్పించి సభను అలరించారు.

తదనంతరం పూర్వ మైన్స్ డైరెక్టర్డాక్టర్ వీడి రాజగోపాల్...రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎ .ఎల్ .క్రిష్ణారెడ్డి...కోగంటి ఉషారాణి...పోలయ్య కవిని ఘనంగా సన్మానించారు.తరువాత సన్మన గ్రహీత పోలయ్య కవి మాట్లాడుతూ, ఔత్సాహిక కవులను గుర్తించే...ప్రతిభను ప్రోత్సహించే.... కళాపోషకులు...డాక్టర్ వీడి రాజగోపాల్ తనకు అనేక సాహితీ వేదికల మీద, ఎన్నో
సందేశాత్మక కవితలు గానంచేసే చక్కని అవకాశాలను కల్పించారని, వారికి తాను సదా రుణపడి ఉంటానని, రాజగోపాల్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సభకు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు వాసురావు హాజరై తమ తండ్రి గురించి ఎన్నో కొత్త విషయాలను చెప్పి ఆహుతులను ఆనంద పరిచారుఈ సభలో గాన గంధర్వ శరత్ చంద్ర
వారి బృందం అరవా రవీంద్రబాబు డాక్టర్ వి డి రాజగోపాల్ చక్కని సినీ గీతాలను =ఆలపించి సభను అలరించారు.
ఈ సభకు ఇంకా డా. వెంకటరమణ, సిద్దారెడ్డి బయ్యపురెడ్డి, విజయరామరాజు తదితర  ప్రముఖులు హాజరయ్యారు. చివరలో కవితాగానం చేసిన కవులందరిని డాక్టర్ వి.డి రాజగోపాల్ ఘనంగా సన్మానించారు అల్పాహారం విందుతోసభ దిగ్విజయంగా ముగిసింది

కామెంట్‌లు