సుప్రభాత కవిత : - బృంద
ఆశల సుమాలు వెదజల్లి 
ఆకాశంలో చుక్కల్లా మెరిపించి 
అందీ అందక ఆటాడిస్తే
ఆరాటపు హోరు పెరగదా?

ఎప్పుడెప్పుడని ఎంత వేచినా 
ఎదురే అవని తీరంలా 
ఊరించే ఊహల ఊయల
ఊపు లేక ఆగిపోదా?

తలపుల తలుపులు తట్టి 
తరగని  తపనలు పెంచే
తేలి పోయే  మనసుకు 
తెలి కిరణపు పల్లకి తేదా?

వేచిన మదిలో  వేయిగా
వెలుగులపువ్వులు కురిపించి
వేధించిన వెతలను
తరిమేసే తరుణం రాదా?

జవాబు లేని ప్రశ్నలకు 
సమాధానంలా.....
తెలియని పరీక్షలను
గెలిపించే  తోడవదా?

నవ్వుల పువ్వులు  విరిసే 
హృదయం సుందరవనమై 
వాడని వేడుక నిచ్చే తోడై 
నడిపించే  వెచ్చని వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు