జంతువిశేషాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకి విసుగు చిరాకు నిద్ర వస్తుంటే ఆవలిస్తాం అలాగే చేప పిల్లి కుక్క కూడా ఆవలిస్తాయి పిల్లి కుక్క తమ పెత్తనం చూపించడానికి ఆవలిస్తాయి దుడుకు స్వభావం తో పళ్ళని బయటపెట్టి పెద్దగా నోరు తెరుస్తాయి కుక్కలు పిల్లులు పాకే జంతువులు శరీరం చల్లబరుచుకోవడం కోసం ఆవలిస్తాయి కీటకాలు ఆవలించవు షార్కు ప్రాణి ఆవలిస్తుంది దాన్ని చూసి మిగతావి భయపడతాయి ఇక కుందేళ్ళు చాలా బాగా శరీరాన్ని శుభ్రపరచుకుంటుంది ముఖ్యంగా తన చెవులని ప్రతిసారి శుభ్రం చేస్తుంది తన పాదాలనే నాకి వాటితో చెవుల పైభాగాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది దీనివల్ల రికెట్స్ అనే వ్యాధి సోకదు. కుందేలు చెవుల పై భాగంలో ఉండే కెమికలు విటమిన్ డీగా మారి దాని చెవులను శుభ్రం చేస్తున్నప్పుడు అది ఆ విటమిన్ ని గ్రహిస్తుంది .ట్రీ ష్రూస్ అనే చిన్న ఉడతలు ఎనిమిది రకాల ధ్వనులు చేస్తాయి చాలా పెద్దగా విజిల్ వేస్తాయి తమకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అని తెలియగానే ఒకదాని వెంట ఒకటి అలా విజిల్ వేస్తూనే ఉంటాయి శత్రువు ఈ విజిల్స్ విని అన్ని వైపుల నుంచి ఆ శబ్దం వినపడటంతో కంగారు గాబరా ఎత్తి అక్కడి నుంచి పారిపోతుందిఅక్కడి నుంచి పారిపోతుంది కోతులు ఒకదాని తలని ఇంకోటి పేల కోసం వెతుకుతూ దొరికిన దాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తాయి అవి గుంపులుగా కోడి డి నెత్తిని ఉన్న జుట్టుని బొచ్చుని సవరిస్తూ టెన్షన్ నుంచి బయటపడతాయి స్నేహ బంధాన్ని బలపరుచుకుంటాయి చిన్న కోతి పిల్లలను నెత్తినెమూరుతూ తలలో పేలు తీస్తూ ధైర్యం కలిగిస్తాయి అలా మృత చర్మాన్ని తొలగిస్తాయి అవి మురికి  క్రిములు ని శుభ్రం చేయడమే కాక ఆసరాగా అండ దండగ కలిసికట్టుగా ఉండి మనకు ఆదర్శంగా ఉన్నాయి🌹
కామెంట్‌లు