ప్రాణి ప్రపంచం! అచ్యుతుని రాజ్యశ్రీ

 కమ్మగా పాడే కోయిల గూడు కట్టుకోవడంలో మాత్రం మహాబద్ధకస్తురాలు తన గుడ్లను కాకి గూటిలో పెడుతుంది అలాగే కుకు బి చాలా అందంగా ఉంటాయి కానీ బాగా కష్టపడేటువంటి బంబుల్ బి గూటిలో చొరబడి అందులోని రాణి చంపి తన గుడ్లను అందులో పెడుతుంది ఈ బంబుల్ బి ఎంత స్వార్ధపరాలో కదా ఇక ఆస్టర్ క్యాచర్ పెద్ద సైజులో నలుపు తెలుపు రంగులో ఉండి పొడవాటి ఆరంజ్ ఎరుపు కలిసిన ముక్కుతో ఎరుపు పింక్ కలర్  కాళ్లతో ఉంటుంది ఇది క్రాఫ్ట్ క్రిములు తింటుంది ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి .ఆస్టర్ని తినేది అలాంటి పక్షితోనే జతకడుతుంది. అంటే తాము తినే ఆహారాన్ని తినేది వాటిని మాత్రమే తన జతగా ఎన్నుకుంటుంది అలాగే వాటి పిల్లలు కూడా మొదట ఖాళీ గుల్లల్ని పొడుస్తాయి తమ తమ అమ్మ నాన్నలు తిని పడేసిన గుల్లలు నత్తగుళ్లలో మాంసం కోసం వెతుకుతాయి అలా క్రమంగా తమ ఆహారాన్ని స్వయంగా తినటం నేర్చుకుంటాయి పావురాళ్లు ఒకదాని ముక్కును ఒకటి కలిపి ఉంచడానికి బిల్లింగ్ అంటారు ఆడ పావురం సలేవని మగ పావురం నోట్లోకి పంపుతుంది మగ పావురం ఒక విధమైన పాల లాంటి ద్రవపదార్థాన్ని విడుదల చేసి తన పావుర పిల్లలకు అందిస్తుంది ఈ విధంగా మగ ఆడ పావురాలు ఒకదానికొకటి తోడునీడగా జంటగా తమ నోట్లో పాలని విడుదల చేసి పిల్లలను పెంచుతాయి బేబీ ష్రూ అనే ప్రాణి వింతగా అనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం తమ నివాసం దగ్గర జరుగుతుంది అని అనుమానం వచ్చినప్పుడు తల్లి తన చిన్నారి పిల్లల్ని ఒక వరుసలో రైలు పెట్టలాగా లాక్కుని తీసుకు వెళుతుంది తల్లి తోకని ఒక చిన్న ష్రూ గట్టిగా తన నోటితో పట్టుకుంటుంది ఈ చిన్నారి తోకని మిగతా పిల్లలు ఒకదాని వెనక ఒకటి నుంచుని రైలు పెట్టే లాగా వాటి తోకాల్ని పట్టుకుని తల్లి వెనకాల సురక్షిత ప్రాంతానికి చేరుతాయి ఒకవేళ ఏదైనా దాని నోటి పట్టు తప్పి విడిపోతే అది మళ్లీ తమతో కలిసేదాకా తల్లి మిగతా పిల్లలు సరి చేస్తూ అలాగే నిలబడతాయి
ఇక రకరకాల ఆకారాలు సైజుల్లో ఉంటాయి ఒక పక్షి అనువైన ప్రదేశం కోసం వెతుకుతుంది అలా ఆడ మగ జంటగా ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని దాని కావాల్సిన వస్తువుల కోసం ప్రయత్నాలు ఆరంభిస్తాయి పక్షులు గూడు కట్టే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని మనం చూస్తే గాని అర్థం చేసుకోలేం బాతు పిల్ల గుడ్డు లోంచి బయటికి వచ్చాక తల్లిని మాత్రమే చూసి బుర్రలో గుర్తు పెట్టుకుంటుంది దీన్ని ఇన్ ప్రింటింగ్ అంటారు తల్లి ఎక్కడుంటే అక్కడికి ఆ బాతు పిల్ల వెళ్తుంది ఒక్కోసారి తన తల్లి కాకపోయినా కొత్త బాతు వెంట ఈ బాతు పిల్లలు వెళ్లటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక మేకలను మనం చూస్తూనే ఉంటాం. అది కాసేపు విశ్రాంతిని కోరుకుంటుంది రోజులో కనీసం ఎనిమిది గంటలు ఎలాంటి పనీ పాటు లేకుండా నేలపై పడుకుని ఉంటుంది కళ్ళు తెరుచుకునే ఉంటాయి అది నిద్రమత్తులో ఉన్నప్పుడు తలని కిందకు వేలాడేసి చెవులని బాగా జారుస్తుంది అలా నిద్రపోతుంది కానీ మనుషులు చూస్తూ ఉంటే అది స్థిమితంగా విశ్రాంతి తీసుకోలేదు మనలాగా ఒకేసారి కొన్ని గంటలు మేక నిద్రపోలేదు కుక్కలాగా కాసేపు కళ్ళు తెరవటం కాసేపు మూసుకోవడం శబ్దానికి అనుగుణంగా ప్రవర్తించటం దాని స్వభావం🌹
కామెంట్‌లు