సామెత -8-\అందని ద్రాక్ష పుల్లన
*****
లచ్చక్కా! లచ్చక్కా!ఇంకో సున్నుండ తినాల్నుంది.నువ్వోటి నేనోటి తిందామా? తనబ్బి పైకి చూస్కుంట అంటున్న తమ్ముడిని చూసి"
"ఒరేయ్ !అవ్వేం జెప్పిందో గప్పుడే మరిసినవా? దినాం ఒక్కటి కంటే ఎక్కువ తింటే పొట్ట నొస్తదన్లే?
"నీయవ్వ! అవ్వ గట్లనే అంటది గని. అవ్వొచ్చేది కనిపెట్టు. నేను స్టూలు పీట ఎక్కి తీస్త." అనుకుంట డబ్బా అందుకోబోయి స్టూలు బెనికిసలాడి దబ్బుమని కింద పడ్డడు.
ఏందిరా సప్పుడు? గబ్బగబ్బ ఏమైందోనని ఉరుకొచ్చి అంటున్న అవ్వ మాటలకు "ఏం లేదవ్వా! అని భూలచ్మి,బుష్కోటు లాగు దులుపుకుని లేచి నిలబడ్డ బుడ్డోడేమో."నువ్వు జేసిన సున్నుండలేం బాలేవు అవ్వా! అంటుంటే నవ్వొచ్చింది అవ్వకు.
అవున్రా "అందని ద్రాక్ష పుల్లనేగా" అంది.
భూలచ్మి, బుడ్డోడు ఏమర్థం కాక తెల్లమొహాలేసి సూస్తుంటే.. గదేందో నే జెప్తా రాండి మంచంకాడికి తీస్కపోయి చెరో పక్కన కూసబెట్టుకుని చెప్పింది.
అడవిలో మీలాగనే రెండు నక్క పిల్లలు ఆడుకుంట ఆడుకుంట ఓ ద్రాక్ష తోటకెళ్ళినయ్. అక్కడే చానా సేపు ఆడుకున్నయి. తోటలో పందిరి కింద కొన్ని ద్రాక్ష కాయలు రాలి పడుంటే వాటిని చెరోటి నోట్లో వేసుకుని భలే! భలే! తీయంగున్నవి అనుకుంట దొరికినవన్నీ ఏరుకొని తిన్నవి. వాటికి ఇంకా తినాలనిపిచ్చింది. పందిరి పైన గుత్తులు గుత్తులుగా ఏలాడుతున్న వాటిని ఎగిరెగిరి అందుకో బోయినయ్. ఎంత ఎగిరినా అందలేదు. అప్పుడా నక్క పిల్లలు "అవి పుల్లంగున్నయ్. అందుకే మనకు అందలేదు.పోదాం పా అనుకుంట అక్కడ నుంచి ఎళ్ళిపోయినయ్." అందని ద్రాక్ష పుల్లన" కత బాగుందా అనంగనే ఇద్దరూ సిగ్గు పడుకుంట అవ్వ కొంగులో మొఖం దాసుకున్నరు. "ఇంగ పటండ్రా! మీ కోసమే నా పైసల కీసలో పొట్లం గట్టి దాసిన.పటుండ్రి! చెరోటి ఇచ్చింది.
అదండీ! సంగతి. "అందని ద్రాక్ష పుల్లన" అంటే. కావాలనుకున్నయి దొరకనప్పుడు, మనకు ప్రాప్తం లేదు అనుకోవడం కంటే అవి బాగా లేవు కాబట్టే మనకు దొరక లేదు అని సర్దుకు పోవడాన్ని ఈ సామెతతో పోలుస్తారు.
కీస - సంచి. బుష్కోటు- షర్ట్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి