అది ఒక నిశ్శబ్ద మధ్యాహ్నం. చెర్రీ పువ్వులతో నిండిన ఆకాశం కింద, ఒక చిన్న అమ్మాయి తన అమ్మమ్మ పక్కన ఓ చెక్క బెంచ్ మీద కూర్చుంది.
రేకులు గులాబీ రంగు మంచులా తేలుతున్నాయి. మృదువైన గాలి వసంతకాల సువాసనలను గుర్తు చేస్తోంది.
ఆ అమ్మాయి తన అమ్మమ్మ ప్రత్యేకంగా ఏమీ చూడకుండా నవ్వడం చూసింది. గాలి, పువ్వులు, వాటి మధ్య నిశ్శబ్దం మాత్రమే అక్కడి ఉన్న దృశ్యాలు.తన ఉత్సుకతను ఆపుకోలేక, ఆమె అడిగింది "అమ్మమ్మా, ఎటువంటి కారణం లేకుండా నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు?” అని.
ఆ వృద్ధురాలు చిన్న నవ్వు నవ్వింది. సూర్యాస్తమయంలాంటి సున్నితమైన ఆమె కళ్ళు దశాబ్దాల కథలతో మెరిశాయి.
అమ్మమ్మ, “ఓ పిల్లా, నేను చాలా సంవత్సరాలు కారణాల కోసం వేచి ఉండే దానిని. నన్ను సరిగ్గా ప్రేమించే వ్యక్తి కోసం వేచి ఉండే దానిని. మంచి రోజుల కోసం వేచి ఉండే దానిని. ప్రతి దాని కోసం నిరీక్షించే దానిని. నేను అనుకున్న వాటి కోసం అన్వేషిస్తూనే ఉండే దానిని. కానీ నేను ఎంతలా వెంట పడుతుంటే అంతకు రెట్టింపు దూరాన ఉంటూ ఉండేది ఆనందం....”
అని ఒక్క క్షణం ఆగింది.
ఆ అమ్మాయి తల వంచి “అప్పుడు నువ్వు ఏం చేసావు?” అని ప్రశ్నించింది.
“నేను పరిగెత్తడం మానేశాను” అని ఆ అమ్మమ్మ గుసగుసలాడింది.
“నేను చుట్టూ గమనించడం మొదలుపెట్టాను…నా ముఖం మీద సూర్యకాంతి వెచ్చదనం... తెల్లవారుజామున పక్షుల కిలకిలలు.... అపరిచితుల నవ్వులు.... కన్నీళ్ల తర్వాత ఉండే నిశ్శబ్దమూ.... ఆనందం అనేది కనుగొనడంలో కాదు అని నేను గ్రహించాను. అది మనం లోపలికి తీసుకోవడంలోనే ఉంది” అని అమ్మమ్మ చెప్పగా ఆ చిన్నమ్మాయి గాలితో పాటు నర్తిస్తున్న పువ్వుల వైపు చూసింది. “సరే... నీకు ఇక కారణం అవసరం లేదా?” అని అడిగింది.
అమ్మమ్మ నవ్వింది. ఆ నవ్వు ప్రశాంతమైనది.
“లేదు, ఆనందంగా ఉండటానికి ఏదో ఒక కారణం అవసరం అనుకున్న ఆలోచన ఆగిపోయింది. ఇలా అనుకున్న క్షణంలోనే జీవితం మళ్ళీ వికసించడం ప్రారంభమైంది” అంది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి తన అమ్మమ్మ భుజంపై వాలింది. ఆమె హృదయం విప్పారింది. ప్రపంచం కూడా లోతైన శ్వాస తీసుకున్నట్లుగా అనిపించింది.
చాలా సేపు, ఇద్దరూ మాట్లాడలేదు. వారి మధ్య మౌనం చోటుచేసుకుంది. పువ్వులు రాలిపోతూనే ఉన్నాయి. కానీ ప్రతిదీ నిశ్శబ్దంగా సాగిపోతోంది. ఆనందం నిశ్శబ్దంగా వాటి పక్కన కూర్చున్నట్లు ఉంది.
అందుకే అంటారు అనుభవజ్ఞులు...
మీరు ఇకపై నవ్వడానికి కారణం అవసరం లేనప్పుడు, జీవితం తేలికగా మారుతుంది అని.
ప్రతి శ్వాస ఒక పనిగా కాకుండా బహుమతిగా అనిపిస్తుంది.
ప్రపంచం మారదు. మీ హృదయం మారుతుంది. అక్కడే ఆనందం ప్రారంభమవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి