అలా జరుగుతుంది: - - యామిజాల జగదీశ్
 దుబాయ్ వ్యవస్థాపకుడు షేక్ రషీద్‌ను ఒకసారి తమ దేశ భవిష్యత్తును ఎలా చూస్తారని అడిగారు. 
అప్పుడాయన ఇలా సమాధానమిచ్చారు ...
"మా తాత ఒంటెను వాహనంగా చేసుకున్నారు. మా నాన్నా ఒంటెనే వాహనంగా చేసుకున్నారు. నేను మెర్సిడెస్‌ కారులో పోతుంటే వాడిని. మా కొడుకు ల్యాండ్ రోవర్‌ లో ప్రయాణిస్తారు. మా మనవడు కూడా ల్యాండ్ రోవర్‌లో ప్రయాణిస్తారు. కానీ నా మునిమనవడు, బహుశా మళ్ళీ ఒంటెనే వాహనంగా చేసుకుంటాడు" అని
"మీరు ఎందుకలా చెబుతున్నారు?" అని ఆయనను అడిగారు.
"ఎందుకంటే ప్రపంచాన్ని పాలించే కొన్ని కాలాతీత సత్యాలు ఉన్నాయి" అని అంటూ ఆయనిలా అన్నారు...
"క్లిష్టపరిస్థితులు బలమైన వ్యక్తులను సృష్టిస్తాయి. బలమైన వ్యక్తులు మంచి సమయాలను సృష్టిస్తారు. మంచి సమయాలు బలహీన వ్యక్తులను సృష్టిస్తాయి. బలహీనులు కష్ట సమయాలను సృష్టిస్తారు. చాలామంది దీనిని అర్థం చేసుకోలేరు, కానీ "శ్రేయస్సు" యోధులను సృష్టించదు. ఇది పరాన్నజీవులను సృష్టిస్తుంది. ఆ విధంగా మంచి సమయాలు అదృశ్యమవుతాయి."

కామెంట్‌లు