సీతాకోక చిలుకగా మారిన గొంగలి పురుగా...!
అందమైన నీ ఆశల రెక్కలతో...
అసహ్యించుకునే జనాలనే... ఆకర్షి0చుకోగలిగావ్...!
పూవు పూవు పై వాలి మకరందాన్ని గ్రోలి....
ఆనందించే అదృష్టానికి నోచు కున్నావ్...!!
మలిన మనస్కుడైన ఈ మనిషి కూడా...
నియమ నిష్ఠల ధర్మా చరణ చేత...
నీ లా ముక్తిని పొంది....
అందరి అభిమానమును పొంది...
ఆనందమును పొందుతూ....
సుఖ,సంతోషములతో జీ వించ మనుచు...
నీవిచ్చు సందేసమును
విని,ఆచరించు వారెవ్వరు?!
ఆచరించి ...ఆనంద ముగ జీవించు వారెందరు!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి