సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల( భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -32: - అగ్గువ కొననియ్యది - ఫిరం అమ్మనియ్యది
****
"అవ్వా! అవ్వా! ఓ గప్పుడు నువ్వు బుజ్జక్క లగ్గానికి చంద్రారం ఏస్కుని బొయినవ్ జూడు.గదొక్కపాలి నేన్గూడ ఏసుకుంటనే?" గావురాలు పడ్కుంట అన్న భూలచ్మి మాటల్కి ఉలికిపడింది.
ఏందే పొల్లా! గదేమన్న యిత్తడి సొమ్మనుకుంటున్నవ? పుత్తడే తల్లీ పుత్తడి! గదిప్పుడు ఎంత పిరమైందో ఎరికేనా ?గది నీకు గావల్సొచ్చినాది? కొంచెం లాషిగనే గదమాయించుకుంట "ఇంతకీ ఎవలిదే లగ్గం?" అంది.
గా మాటలకు భూలచ్మి అల్గి "నీ యవ్వ! నన్ను తిట్టినవ్ గా! నేజెప్పను పో! ఏడ్పు మొగంతో ఓ మూలన బొయ్యి కూసుంది.
"గదేందో బంగారం మాటెత్తంగనే మత్తు కోపమొత్తాంది ఈ మద్దెన. పాపం సిన్న పొల్ల గదడగంగనే గంత లాషిగ అనాల్న" మనసుల అన్కుంట"ఒరేయ్ బుడ్డోడా! దాన్నిటు బిల్సుకురా!ఇట్టమైన బొంగుండలు జేసిన గవి తిందుర్గని. ఇంతకీ గా సెంద్రారం ఎందుకో తెల్సుకోరా?"
 ఓ అవ్వా! గది నాకు సుత దెల్సే. ఎల్లుండు ఐతారం అక్క దోత్తు మీనాచ్చి పుట్టిన్రోజు. నన్ను సుత రమ్మంది.
అంద్కేనానే భూలచ్మీ! అల్గి పుల్గం దిన్నదిగ సాల్గని, ఇంగదా! నా బంగారు తల్లిగా! మామ్మగని ఇట్రాయే" బత్మిలాడేసర్కి మెత్తబడి దెగ్గరకొచ్చింది.
అంతట్లనే..." ఇంగో! దీన్కి మాలావు గావురమెక్కువైంది.నా తానకొచ్చేమో నక్లీసు గావల్నంది.ఈడకొచ్చి చంద్రారం గావల్నంట చంద్రారం. "బంగారమెంత పిరమైందో దీన్కేం దెల్సు.పొల్ల పుట్టినప్పుడు అసలే ఆడపొల్ల పెద్దై లగ్గం నాటికి గిప్పట్నించే అగ్గువున్నప్పుడు అంతో ఇంతో కొందామంటే వీల్లయ్య పడ్నిచ్చిండా? నా తానెక్కడియి.పదో పర్కో సేతిలాడితే ఎగసాయానికే బెడ్తున్నం. సూత్తన్నవ్ గద, ఇంకాత్త ధర తగ్గినపుడు కొందం తీ!" అని నోరెత్తకుండ జమిడికేస్కుండు. గిప్పుడేమో పైసలవసరమని గా ఉన్న దాన్ని బేంకుల బెట్టిండు".సందు దొరికిందని సణుగుడు షురూ జేసింది కోడలు.
 నిజమేనే అగ్గువున్నప్పుడు ఇంకాత్త తగ్గుద్దేమోనన్న ఆశ గప్పుడు కొన్నీయ లేదు. గిప్పుడు పిరమైందని అమ్మ చేతుల్రాకనే గా నగల్ని బేంకుల బెట్టి పొలం మీన పెట్టుబడి కోసం పైసలు దీస్కొచ్చినం గద.
 బుడ్డపొల్ల నోరుదెర్సి అడ్గింది. గివన్ని  దాన్కి ఏం దెలుత్తయ్.మనకీ మంచిదినాలు వత్తయ్.నువ్వు రంధి జేయకు.నీకెందుకు నువ్  సూత్తుండు నా మన్వరాలికి ఏడు వారాల నగలు పెడ్త "అంటున్న అవ్వను, మూతి మూడొంకలు తిప్పుకుంట బొయిన అమ్మను సూత్తుంటే..
 బుడ్డోడు, భూలచ్మికి గా సొమ్ములు గిప్పుడు లెవ్వన్న యిషయం దప్ప ఇంగేం సమజ్ గాక తెల్లమొగాలేసిండ్రు.
బాగా బలిసినోళ్ళకి అగ్గువ,పిరంతో పనేముంది. ఇగ్గో గిప్పుడు బంగారం లచ్చ దాటిందన్నా ఏ బంగారం కొట్టు జూసినా జనాలే జనాలు.గాళ్ళకా పైసలు యాడ్నించి ఒత్తున్నయో... మన్సుల అన్కుంట" రేపు తెప్పిత్తలేవే గవాటికన్న తలుకు తలుకున మెర్సే నగలు నాయిన రానీ! ఇంగపటని చెరో బొంగుండియ్యంగనె అల్గుడు,గిల్గుడు మర్సి తీస్కోని గక్కన్నించి సంబురంగ కదిలిండ్రిద్దరు.
 గదండీ సంగతి!  అగ్గువున్నప్పుడు కొనాలనిపించదు. అప్పుడుండే సమస్యలు అప్పుడుంటయ్, లేదంటే ఇంకాస్త అగ్గువైద్దని ఆశ.  ఫిరం అమ్మ నియ్యదంటే మల్లంత ఖరీదు బెట్టి చేయించకుంటమా, కొంటమా అన్న ఆలోచన తొందరపడి దేన్నీ అమ్మనియ్యదు.అందుకనే "అగ్గువ కొననియ్యది - ఫిరం అమ్మనియ్యది" అనే సామెత పుట్టుకొచ్చిందేమో." గిది బంగారం ఒక్కదాన్కే గాదు, పొలము,శెల్క, స్థలం దేనికైనా గిదే సామెత.se


కామెంట్‌లు