చిత్తూరులోని రెవెన్యూ భవన్లో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు

 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం  పురస్కరించుకొని ఆదివారం   రెవెన్యూ భవన్ చిత్తూరులో జరిగిన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు  జానపద సoబరాలు మరియు సినీ సంగీత విభావరి కార్యక్రమం  మేనేజింగ్ డైరెక్టర్ డా. యు వి రత్నo మరియు జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో  విజయవంతముగా నిర్వహించడం జరిగింది.  100 మంది కవులు రచయితలు ఉపాధ్యాయులు కార్యక్రమంలో  కవితాగానము చేయడము   జరిగింది. పిల్లల  నృత్య ప్రదర్శనలు తో కార్యక్రమం విజయవంతము అంగరంగ వైభవంగా  నిర్వహించడముతో తెలుగు భాష అభివృద్ధి వన్నె  తెచ్చే విధంగా ఉందని ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ప్రముఖ అతిథిగా  సర్కిల్   ఇన్స్పెక్టర్ జి. నిత్యబాబు   కేశవరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శ్రీథర్ రెడ్డి  మండల  పరిషత్ అభివృద్ధి అధికారి పలమనేరు బాలాజీ పోగ్రామ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నం మరియు జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి 
చేతులు మీదుగా గురుతేజo జీవన సాఫల్య పురస్కారం జానపద స్వర మధురీ కార్యక్రమం తో అవార్డు సర్టిఫికెట్ శాలువాతో సత్కరించడము జరిగింది.
కామెంట్‌లు