సాంకేతిక సముద్రాన్ని ఈదేయువత కలల అలల మధ్యమునిగేను తీరం చేరే దారేలేక..!స్మార్ట్‌ఫోన్ ఒక మన్మధ బాణం...మనసు నిండా మానని గాయాలే ...చిక్కితే సైబర్ నేరగాళ్ల గాలానికిఖాతాలన్నీ ఖాళీ కంచాలే...ఒక నెట్ నిండా కల్తీ స్నేహాలే...పరిమళించని ప్రేమ కుసుమాలే...హాట్ హాట్ చాట్ నిండా విషపు వలలే..ఒక లైక్ కోసంకోల్పోకు నీ విలువను...ఒక కామెంట్ కోసంఅమ్ముకోకు నీఆత్మను...అశ్లీల వీడియోల వరదలోవినోదమెక్కడ..? విజ్ఞానమెక్కడ..?విషం చిమ్మే విషనాగుల బుసలు తప్పనెట్ ఒక బూతు బూటకం...బంధాలు బాంధవ్యాలు ఒక నాటకం...ఈ జీవితం ఒక పోరాటం ఆశల ఆరాటం..స్మార్ట్ స్టార్స్ గా వెలిగి పోయేఓ యువతా..గుర్తుంచుకోండి...డ్రగ్స్ ఒక సర్పాల సరోవరం...కాదది హాబీ అదొకఊబి అదొక విషకౌగిలి...అదొక మత్తుమందు...సేవిస్తేమీ బ్రతుకంతా విషం చిందు...టెక్నాలజీ టెడ్డీ బియర్ కాదుబొమ్మలా ఆడుకునేందుకు...అంగడి బొమ్మ కాదువిచ్చలవిడిగా వాడుకునేందుకు...అది నీకు "బిగ్ బాస్" కారాదుదానికి నీవు "బానిసవు" కారాదుబలైపోరాదు.నిన్ను మత్తులో ముంచాలినీ డ్రగ్స్ కాదు...నీ డే డ్రీమ్స్ కాదు నీ స్వీట్ డ్రీమ్స్...కావాలి నీ చైతన్యంచీకటిని చీల్చే కిరణం...కావాలి నీ జ్ఞానంతిమిరాన్ని తరిమే దీపం...ఓ యువతా నీచేతుల్లోనేఉంది ఈ దేశపు బంగారు భవిత...డ్రగ్స్ తాత్కాలిక మత్తు కాదు....అదొక మాయాజాలం అదొక శాశ్వత శిలువశిక్షస్వస్తిపలుకు మత్తుకు అదే నీకు శ్రీరామరక్ష
ఓ యువతా మేల్కో..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి