బాలుకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

 తొట్టంబేడు:మండలం లో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారం తిరుపతి మహతి కళాక్షేత్రం లో వే ఫౌండేషన్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా అందుకున్నారు.విద్య,కళలు, సాహిత్యం మొదలగు రంగాల్లో అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు బాలుకి ఇచ్చినట్టు  వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం,మహారాష్ట్ర తెలుగు వాచకం లో పాఠ్యాంశంగా నా గేయం రావడం, ఇప్పుడు జీవిత సాఫల్య పురస్కారం లభించండం చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరాములు, మునిరత్నం,రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు